బండి సంజయ్ కు స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు

byసూర్య | Thu, Sep 22, 2022, 05:04 PM

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ చేపడుతున్న నాలుగవ విడత ప్రజాసంగ్రామ పాదయాత్ర గురువారం ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ పుల్లారెడ్డి స్వీట్ షాప్ వద్ద వినూత్నంగా జేసిబి, ట్రాక్టర్లతో నిర్వహించిన ర్యాలీలో బండి సంజయ్ జేసిబి పై ఎక్కి అభివాదం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో కాషాయపు జెండా డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయమని తెలిపారని కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ఆయన అడుగడుగునా ప్రజలు, మహిళలు హారతులతో, పూవుల వర్షం కురిపిస్తూ, తెలంగాణ సంస్కృతి బతుకమ్మ ఆటలతో వినూత్నమైన రీతిలో ఘనంగా స్వాగతం పలికారని ఊహించని స్పందనతో పాదయాత్ర కొనసాగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం చేతిలో బంది అయ్యిందని వారి అవినీతి పాలనలో రాష్ట్ర ప్రజలు విసుగు చెందారని వచ్చే ఎన్నికలలో ఎగిరేది బిజెపి జెండా రానున్నది రామరాజ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు.

Latest News
 

తెరాస పాలనలో ఆలయాలకు మహర్దశ : ఎమ్మెల్యే Tue, Oct 04, 2022, 05:29 PM
మున్సిపల్ చైర్ పర్సన్ పావని జంగయ్య యాదవ్ ను అభినందించిన మంత్రి కేటీఆర్ Tue, Oct 04, 2022, 04:56 PM
మునుగోడులో ప్రచారంపై తేల్చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి Tue, Oct 04, 2022, 04:46 PM
మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితంలో ఆనందం Tue, Oct 04, 2022, 04:22 PM
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల మూసివేత Tue, Oct 04, 2022, 03:58 PM