గ్రీన్ఇండియా చాలెంజ్‎లో మొక్కలు నాటిన న్యూజిలాండ్ గాయని

byసూర్య | Thu, Sep 22, 2022, 04:01 PM

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్‎లో దేశవిదేశాల ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొంటున్నారు. తాజాగా న్యూజిలాండ్ గాయని, నటి నటి షిర్లీ సేఠియా గ్రీన్ఇండియా చాలెంజ్‎లో పాలుపంచుకున్నారు. అందులో భాగంగా జూబ్లీహిల్స్‎లో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా షిర్లీ సేఠియా మాట్లాడుతూ. గ్రీన్ ఇండియా చాలెంజ్‎లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. తెలంగాణలో వాతావరణం చూస్తుంటే ఎంతో అందంగా గ్రీనరితో నిండి ఉందన్నారు. ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‎కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విక్టరీ వెంకటేష్, శిల్పా శెట్టి, రాజ్ కుమార్ రావు, అభిమన్యు ఈ నలుగురికి షిర్లీ సేఠియా గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు. ఈ కార్యక్రమ అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ. వృక్ష వేదం పుస్తకాన్ని షిర్లీ సేఠియాకి అందజేశారు.

Latest News
 

తెరాస పాలనలో ఆలయాలకు మహర్దశ : ఎమ్మెల్యే Tue, Oct 04, 2022, 05:29 PM
మున్సిపల్ చైర్ పర్సన్ పావని జంగయ్య యాదవ్ ను అభినందించిన మంత్రి కేటీఆర్ Tue, Oct 04, 2022, 04:56 PM
మునుగోడులో ప్రచారంపై తేల్చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి Tue, Oct 04, 2022, 04:46 PM
మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితంలో ఆనందం Tue, Oct 04, 2022, 04:22 PM
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల మూసివేత Tue, Oct 04, 2022, 03:58 PM