ఈటెల సమక్షంలో చేరికలు

byసూర్య | Thu, Sep 22, 2022, 02:18 PM

బిజెపి నాయకులు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సమక్షంలో పలువురు బీజేపీ పార్టీలో చేరారు. ఆదిలాబాద్ జిల్లా బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ప్రజాగోస- బిజెపి భరోసా యాత్రలో భాగంగా రెండవ రోజు జైనథ్ మండలంలో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పర్యటించారు. ఇందులో భాగంగానే మండలంలోని ఆనంద్ పూర్ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్, రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి తో కలిసి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు యువకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున బీజేపీ పార్టీలో చేరారు. వారికి ఈటెల రాజేందర్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.ముందుగా గ్రామానికి వచ్చిన ఈటెల రాజేందర్ గ్రామస్తులు, బిజెపి నాయకులు డప్పు చప్పుళ్లతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు కట్కం రాందాస్, బిజెపి నాయకులు ఆదినాథ్, దినేష్ మాటోలియా, లోక ప్రవీణ్ రెడ్డి, మయూరి చంద్ర, విజయ్, పాయల్ శరత్, నాయకురాళ్లు ధోనే జ్యోతి, గంగమణి, పలువురు కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.


Latest News
 

తెరాస పాలనలో ఆలయాలకు మహర్దశ : ఎమ్మెల్యే Tue, Oct 04, 2022, 05:29 PM
మున్సిపల్ చైర్ పర్సన్ పావని జంగయ్య యాదవ్ ను అభినందించిన మంత్రి కేటీఆర్ Tue, Oct 04, 2022, 04:56 PM
మునుగోడులో ప్రచారంపై తేల్చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి Tue, Oct 04, 2022, 04:46 PM
మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితంలో ఆనందం Tue, Oct 04, 2022, 04:22 PM
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల మూసివేత Tue, Oct 04, 2022, 03:58 PM