ఈ నెల 21న హైదరాబాద్ లో పర్యిటించనున్న అమిత్ షా

byసూర్య | Fri, Aug 19, 2022, 09:40 PM

కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ ఈ నెల 21న వస్తున్నారు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 4.15 గంటలకు మునుగోడు చేరుకుంటారు. సాయంత్రం 4.35 గంటలకు సీఆర్పీఎఫ్ అధికారులతో స్వల్ప సమీక్ష ఉంటుంది. అనంతరం 4.40 నుంచి 6 గంటల వరకు అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారు.సభ అనంతరం రోడ్డు మార్గంలో రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకుంటారు. 6.45 నుంచి 7.30 వరకు రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంటారు. అనంతరం శంషాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌కు చేరుకుంటారు. అక్కడ 8 నుంచి 9.30 వరకు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.అనంతరం ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.


Latest News
 

భవిష్యత్తులో టీహబ్ స్టార్టప్‌లు మరిన్ని విజయాలు సాధిస్తాయి : సీఎం కేసీఆర్ Sat, Nov 26, 2022, 09:16 PM
గురుకుల సొసైటీల పరిధిలో 9,096 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ Sat, Nov 26, 2022, 08:35 PM
ఫోన్ ఆటోలో మిస్సింగ్..ఖాతా నుంచి రూ.5వేలు హాంఫట్ Sat, Nov 26, 2022, 08:34 PM
భారీ మెజార్టీతో అధికారం కైవసం చేసుకొంటాం: అమిత్ షా Sat, Nov 26, 2022, 07:17 PM
సీఎం కేసీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన షర్మిల Sat, Nov 26, 2022, 04:07 PM