కోవర్టు రాజకీయాలకు మునుగోడు ప్రజలు బుద్ధి చెబుతారు: బండి సంజయ్

byసూర్య | Wed, Aug 17, 2022, 08:20 PM

కోవర్టు రాజకీయాలకు మునుగోడు ప్రజలు బుద్ధి చెబుతూ.. బీజేపీకి పట్టం కడతారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు తనను మళ్లీ గెలిపిస్తారన్న నమ్మకంతోనే రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని పేర్కొన్నారు. ఎవరెన్ని హామీలు గుప్పించినా, ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా మునుగోడు ఉపఎన్నికల్లో ఎగిరేది కాషాయ జెండాయేనని బండి సంజయ్ అన్నారు. జనగామ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ లాంటిదని ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విషయాన్ని తెలంగాణ ప్రజలు మరిచిపోలేదన్నారు. 


ఇన్నాళ్లూ మునుగోడు నియోజకవర్గాన్ని పట్టించుకోని సీఎం కేసీఆర్.. ఉపఎన్నిక వల్లే నిధులు విడుదల చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనకు స్వస్తి పలికే సమయం ఆసన్నమైందన్న బండి సంజయ్.. డబుల్ ఇంజిన్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డిని గెలిపించుకుని బీజేపీ బలాన్ని పెంచుకుంటామని.. ఇదే తరహాలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిచి బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు.


Latest News
 

టీఆర్ఎస్ పార్టీ నేతలతో ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం Sun, Oct 02, 2022, 09:10 PM
అప్పుడు నేను గాంధీనే గుర్తు చేసుకునేవాడిని... సీఎం కేసీఆర్ Sun, Oct 02, 2022, 06:19 PM
గొప్ప విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్... నటుడు ప్రకాష్ రాజ్ ప్రశంస Sun, Oct 02, 2022, 06:18 PM
దసరా రోజున టిఆర్ఎస్ ఎల్పి సమావేశం... అదే రోజు జాతీయ పార్టీ ప్రకటన Sun, Oct 02, 2022, 06:17 PM
ప్రభుత్వ వైఖరికి నిరసనగా బ్లేడుతో గొంతు కోసుకున్న విఆర్ఏ Sun, Oct 02, 2022, 06:15 PM