ఉచితంగా గణేష్‌ విగ్రహాల పంపిణీ

byసూర్య | Wed, Aug 17, 2022, 03:01 PM

ఈ నెల 31న గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని, వచ్చే నెల సెప్టెంబరు 9న గణేష్‌ నిమజ్జనం నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. గణేష్‌ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 4 లక్షలు, పీసీబీ ఆధ్వర్యంలో లక్ష, హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో లక్ష చొప్పున మొత్తం 6 లక్షల గణేష్‌ విగ్రహాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఖైరతాబాద్‌ గణేష్‌ను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఇబ్బందులకు గురి కాకుండా ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో బారికేడ్లు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ నెల 24న అధికారులతో కలిసి ఖైరతాబాద్‌ గణేష్‌ మండపాన్ని సందర్శిస్తామన్నారు. విగ్రహాల నిమజ్జనం కోసం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 25 పాండ్‌లకు అదనంగా మరో 50 పాండ్‌ను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. విగ్రహాల ఊరేగింపు రహదారుల్లో అవసరమైన చోట్ల మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపడతామన్నారు. సెప్టెంబరు 9న నిర్వహించే గణేష్‌ నిమజ్జనానికి సుమారు 8 వేల మంది జీహెచ్‌ఎంసీ సిబ్బంది మూడు షిఫ్ట్‌ల్లో విధుల్లో ఉంటారని చెప్పారు. గణేష్‌ నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించేలా సహకరించాలన్నారు


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM