మహాత్మా గాంధీ మనందరికీ ఆదర్శం : మంత్రి సబితా

byసూర్య | Wed, Aug 17, 2022, 01:21 PM

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సంద చెరువు వద్ద తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మీరు పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులకు దుస్తులు సబ్బులు శానిటైజర్స్ అందజేశారు. వారు మాట్లాడుతూ దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహాత్మా గాంధీ మనందరికీ ఆదర్శమని వారు తెలిపారు. ఆయన బాటలో నడుస్తూ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల స్తూపం కూడా ఈ చెరువు కట్టమీద ఉండడం విశేషమన్నారు. ఈ సంద చెరువు అందరికీ పర్యాటకంగా ఉంటూ ఇక్కడికి వచ్చే ప్రజలకు మహాత్మా గాంధీని స్మరించుకుంటూ అలాగే అమరవీరులను స్మరించుకుంటూ ఉంటారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్లాల్, డిప్యూటీ మేయర్ తీగల విక్రం రెడ్డి, కార్పొరేటర్లు, టిఆర్ఎస్ నాయకులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Latest News
 

గుర్తు తెలియని మగ వ్యక్తి శవం లభ్యం Fri, Apr 19, 2024, 03:39 PM
ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపును పరిశీలించిన కలెక్టర్ Fri, Apr 19, 2024, 03:38 PM
వ్యాపార కాంక్షతోనే బీబీ పాటిల్ పోటీ Fri, Apr 19, 2024, 03:37 PM
ప్రభుత్వ ఉపాధ్యాయుడి సస్పెన్షన్: డీఈవో రాజు Fri, Apr 19, 2024, 03:35 PM
జాతీయ రహదారిలో ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్ Fri, Apr 19, 2024, 03:33 PM