ఈ దేశంలో దళితులకు రక్షణ కరువైంది: ఎంయస్పి

byసూర్య | Wed, Aug 17, 2022, 12:42 PM

వరంగల్ కాశిబుగ్గ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎం ఆర్పియస్, ఎంఎస్పి ఆధ్వర్యంలో ఇందర్ కుమార్ మేగ్వాల్ చిత్రపటానికి పూలదండ వేసికొవ్వుతులతో నివాళులు అర్పించారు. దీన్ని ఉధ్యేశించి మహాజన సోషలిస్టు పార్టీ వరంగల్ తూర్పు కోఆర్డినేటర్ ఈర్ల కుమార్ మాదిగ మాట్లాడుతూ, , దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా అంటరానితనం పోలేదు, దళితుపైన దాడులు, హత్యలు, హత్యాచారాలు నిత్యం పెరుగుతూనే వున్నాయి ఇందుకు రాజస్థాన్‌లో 9 ఏళ్ల ఇందర్ కుమార్ మేఘ్‌వాల్ హత్యే నిదర్శనం అన్నారు 3వ తరగతి చదువుతున్న ఇందర్ కుమార్ కుండలో నీటిని తాగినందుకు అగ్రవర్ణ టీచర్ తీవ్రంగా కొట్టింది ఏమిటని ఆయన ప్రశ్నించారు. గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలుడు చనిపోయాడు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా దళితులకు, పేదలకు ఇంకా రాలేదు కనీసం మంచినీళ్లు కూడా తాగే స్వేచ్ఛ లేదని ఈ ఘటన నిరూపిస్తోంది. ఈ హత్యను నిరసిస్తూ పెద్దలు మంద కృష్ణ మాదిగ ఆదేశాలమేరకు మంగళవారం నుంచి ఈనెల 22 వరకు వారంరోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడతతమని అన్నారు. ఈ దేశంలో ఆవు మూత్రము తాగే సంస్కృతి వుంది దళితుడు కుండా ను ముట్టుకోని నీళ్లు తాగితేచంపేవిషాశంస్కృతి మను అధర్మం శాస్త్రం నిత్యం పెరుగుతానే వుంది, రాజ్యాంగంలో ఉన్న కులవివక్ష నిర్మూలన అంశం పుస్తకాలకే పరిమితమైందిదీనిపై పాలకుల చిత్తశుద్ధి లేదని చెప్పడానికిరాజస్థాన్ ఘటనే నిదర్శనం అన్నారు. ఈకార్యక్రమంలోఎంఆర్పియస్ జిల్లా కో కన్వీనర్ జన్ను మధుకర్ మాదిగ, కొలకోట్ల గిరి మాదిగ, గంగారపు మల్లన్న మాదిగ, సందేలా లాజర్, వస్కుల విజయ్, కలకొట్ల యాకన్నా మాదిగ, కవ్వం పెళ్లి రవి మాదిగ, నర్మాట చిన్న, పెండ్యాల అరుణ్ మాదిగ పోలేపాక పాటు, గజ్జి రాజు మాదిగ, జన్ను జీవన్ మాదిగ, ఎండీ మోసిన్, ఎండీ అడిల్, మూఢసర్, ఎండీ ఆన్సర్, కస్తూరి భరత్, పిట్టల సుధీర్, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM