భద్రాచలంలో పర్యటించిన సిఎల్పీ బృందం

byసూర్య | Wed, Aug 17, 2022, 12:06 PM

గోదావరి వరదతో ముంచేత్తిన భద్రాచలంలోని సుభాష్ నగర్ కాలనీని సిఎల్పీ బృందం సందర్శించింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, సీతక్క, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డిలకు అక్కడి ప్రజలు వరద ముంపుతో ఎదుర్కొన్న ఇబ్బందులు తెలిపారు. 70 అడుగుల ఎత్తున వరద రావడంతో పది రోజుల పాటు కట్టు బట్టలతోటి సత్రంలో తల దాచుకున్నామని. ఆహార పానీయాలు కూడా ప్రభుత్వం సక్రమంగా సరఫరా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పునరావసం నుంచి నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం అందలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు బాధితులు చెప్పారు. రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ గోదావరి వరద ముంపు ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించడానికి వచ్చి తమ సుభాష్ నగర్ కాలనీకి రాలేదని ఆ కాలనీవాసులు సీఎల్పీ బృందానికి తెలిపారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వారికి భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో భద్రాచలం కరకట్ట నిర్మాణం మరమత్తులు ఎత్తుకోసం 2014 ముందు 45 కోట్లు రూపాయలు మంజూరు చేశామని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ తెలిపారు.

Latest News
 

'ఇది గలీజ్ బుద్ధి కదా.. సిగ్గు తెచ్చుకోవాలి'.. బల్మూరి వెంకట్, క్రిశాంక్ మధ్య ట్వీట్ వార్ Sat, Apr 20, 2024, 07:34 PM
బట్టతలపై వెంట్రుకలు రప్పించేందుకు ట్రీట్మెంట్.. రిజల్ట్‌ చూసి పేషెంట్ల మైండ్ బ్లాక్ Sat, Apr 20, 2024, 07:30 PM
చిన్న క్యారీ బ్యాగ్ ఎంత పని చేసింది.. అంత పెద్ద 'ఐకియా'నే ఫైన్ కట్టించింది. Sat, Apr 20, 2024, 07:23 PM
తీన్మార్ మల్లన్న గిదేందన్నా.. గరీబోళ్లు కదన్న.. బక్కా జడ్సన్ రిక్వెస్ట్ Sat, Apr 20, 2024, 07:20 PM
గరుడ ప్రసాదం ఎఫెక్ట్.. చిలుకూరు ఆలయంలో 'వివాహ ప్రాప్తి' కార్యక్రమం రద్దు Sat, Apr 20, 2024, 07:16 PM