భువనగిరి టీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు

byసూర్య | Wed, Aug 17, 2022, 11:57 AM

ఆ నియోజకవర్గంలోని అధికారపార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయా, ఈ మధ్య పార్టీ నేతల మధ్య జరుగుతున్న వరుస పరిణామాలు కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నాయా, నిత్యం ఆధిపత్యం కోసం పరితపిస్తున్న నేతలతో గ్రూపులు పెరిగి పార్టీ ముక్కలవుతుందా.. ఇంతకీ ఏమా నియోజకవర్గం, ఎంటా కథ...?
ఉమ్మడి రాష్ట్రంలో టిడిపికి పెట్టని కోటలా ఉన్న భువనగిరి నియోజకవర్గంలో, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత గులాబీ జెండా వరుస ఎన్నికల్లో రెపరెపలాడుతుందట, ఉమ్మడి నల్గొండ జిల్లాలో తెరాసకు బలమైన నియోజకవర్గాల్లో ఒకటిగా ఉన్న భువనగిరిలో 2018 ఎన్నికల తరువాత ఆధిపత్య రాజకీయాలకు వేదికగా తయారైందట, భువనగిరిలో పట్టున్న ఎలిమినేటి కుటుంభం 2018లో తెరాసలో చేరినప్పుటి నుండి భువనగిరిలో ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, జెడ్పి చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి ల మధ్య గ్రూప్ రాజకీయాలు మొదలయ్యాయట, భువనగిరి నియోజకవర్గంలో పట్టు సడలకుండా ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి,పట్టుకోసం జడ్పి చైర్మన్ సందీప్ రెడ్డి ప్రయత్నిస్తున్నారట,ఒకరిపై మరొకరు ఆధిపత్యం పెంచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట..ఈ క్రమంలో ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి పాల్గొనే అభివృద్ధి కార్యక్రమాల్లో సందీప్ రెడ్డికి ప్రోటోకాల్ పాటించడం లేదట. ఆ మధ్య వలిగొండ మండలం లో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాలల్లో జెడ్పి ఛైర్మన్ సందీప్ రెడ్డి కి సమాచారం అందించ లేదట. ఇదంతా కావాలనే చేశారని, దింతో సందీప్ రెడ్డి రెండు, మూడు కార్యక్రమాలకు హాజరుకాలేదట. ఈ మధ్య భువన గిరి మోడ్రన్ రైతు బజారు ప్రారంభోత్సవ కార్యక్రమంలోను జెడ్పి ఛైర్మన్ సందీప్ రెడ్డి తన అసంతృప్తిని బహిరంగంగా వేదిక పైనే వెళ్లగక్కారట..ప్రోటోకాల్ పాటించడం లేదని, కనీసం జిల్లా మంత్రి కి సమాచారం ఇవ్వకుండా ఒంటెద్దు పోకడలతో ముందుకు వెళ్తున్నారని ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి ని ఉద్దేశిస్తూ జెడ్పి చైర్మన్ సందీప్ రెడ్డి వ్యాఖ్యలు చేశారట.. ప్రస్తుతం ఎమ్మెల్యే పైళ్లకు వ్యతిరేకంగా ఎలిమినేటి సందీప్ రెడ్డి , జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామ కృష్ణ రెడ్డి ఒక పక్క, మరో నేత చింతల వెంకటేశ్వర రెడ్డి మరో పక్క ఆధిపత్య రాజకీయాలు చేస్తున్నారట, ఛాన్స్ దొరికితే చాలు ఎమ్మెల్యేను ఇరకాటంలో పడేలా సభలు, సమావేశాల్లో మాట్లాడుతున్నారట, ఇక మంత్రి జగదీశ్ రెడ్డి కూడా పైళ్ల వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారట, దీంతో కార్యకర్తలు కూడా గ్రూపులుగా విడిపోయారట చుడాలిమరి భువనగిరి నియోజకవర్గంలో ఏం జరగబోతోందో..


Latest News
 

నేను సాటి కానప్పుడు.. నాపై విమర్శలు ఎందుకు: డీకే అరుణ Thu, Apr 25, 2024, 12:47 PM
ఇంటర్ ఫలితాల్లో 62. 82 శాతం ఉత్తీర్ణత Thu, Apr 25, 2024, 12:20 PM
ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి Thu, Apr 25, 2024, 12:11 PM
అవకాశం ఇవ్వండి అభివృధి చేసి చూపిస్తా : ఎంపీ అభ్యర్థి చామల Thu, Apr 25, 2024, 12:10 PM
నల్గొండ బరిలో స్వతంత్ర అభ్యర్థిగా సురేష్ Thu, Apr 25, 2024, 12:08 PM