పోలీస్ జిందాబాద్.. ఎట్టకేలకు ఛేదించి!

byసూర్య | Tue, Aug 16, 2022, 01:14 PM

కరీంనగర్ జిల్లాలో ఓ కాలనీ వాసులంతా జిందాబాద్ పోలీస్ అంటూ నినాదాలు వెల్లువెత్తయి.. ఎందుకంటే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో బిజీగా ఉన్న కరీంనగర్ పోలీసులు ప్రజల సమస్యలు ఇటు వేడుకలో అపప్రమత్తమయ్యారు.. ఎట్టకేలకు వేడుకలు ముగిసే సమయానికి ఆ పోలీసులకు ఓ కాల్ వచ్చింది.. అదే ఓ చిన్నారి తల్లితండ్రుల నుండి మా పాప కిడ్నప్ అయ్యిందనే వార్త వారి చెవిలో పడగానే ఒక్కసారిగా కరీంనగర్ జిల్లా పోలీసులు అప్రమత్తం అయ్యి ఎట్టకేలకు ఆ చిన్నారిని ఆ తల్లితండ్రుల చెంతకు చేర్చారు.. దీంతో జిందాబాద్ పోలీస్ అంటూ కాలనీ వాసులు ఒక్కసారిగా నినాదాలు చేపట్టారు..


కిడ్నప్ ఎలా జరిగిందంటే!


కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ నగర్ (గోషికట్ట) ప్రాంతానికి చెందిన ఓ ఆటో డ్రైవర్ ప్రయాణికులను తరలించేందుకు వెళ్లాడు. ప్రయాణికులు వచ్చే లోపు ఆరు బయట ఆడుకుంటున్న చిన్నారిని


గమనించి ఆమెను తన ఆటోలో ఎక్కించుకున్నాడు. ప్యాసింజర్లు రాగానే వారిని ఆటోలో ఎక్కించుకుని బయలుదేరుతాడు. అప్పటికే ఆటోలో ఎక్కించుకున్న పాపను గమనించిన ప్యాసింజర్లు ఈ పాప ఎవరు అని డ్రైవరు


ప్రశ్నించగా.. దీంతో తన కుమార్తె అని డ్రైవర్ బదులిచ్చాడు. అనంతరం ప్రయాణికులను డ్రాప్ చేసిన తరువాత ఆటో డ్రైవర్ పోలీసులకు చిక్కకుండా ఎట్టకేలకు అక్కడి నుండి తప్పించుకున్నాడు. కిడ్నాప్ సమాచారం అందుకున్న కరీంనగర్ వన్ టౌన్ సీఐ నటేష్ గౌడ్


ఏసీపీ తుల శ్రీనివాస రావుకు సమాచారం ఇచ్చి స్పెషల్ టీమ్స్ ను రంగంలోకి దింపారు. సీసీ కెమెరాల ఆధారంగా పాప ఆచూకీ కోసం ఓ పోలీసు టీం ఆరా తీస్తుండగా మరిన్ని టీంలు రాజీవ్ నగర్ తదితర ప్రాంతాల్లో గాలించడం


ఆరంభించాయి.


అనంతరం కరీంనగర్ టౌన్ సీఐ తుల శ్రీనివాస రావు ఆధ్వర్యంలో సీఐలు నటేష్ గౌడ్, దామోదర్ రెడ్డి, ఎస్సెలు శ్రీనివాస్, తోట మహేష్, రహీంలతో పాటు మొత్తం 8 బృందాలు కరీంనగర్ మొత్తం జల్లెడ పట్టాయి. సీసీ కెమరాల్లో దొరికిన క్లూ ఆధారంగా కిడ్నాపర్ ఎవరో తెలిసినప్పటికీ పాప ఆచూకీ మాత్రం దొరకలేదు. దీంతో పోలీసులు మళ్లీ టాస్క్ ఆరంభించి చివరకు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాజీపూర్లో మంగళవారం తెల్లవారు జామున 4గంటల ప్రాంతాలో కిడ్నాప్ కు గురైన చిన్నారిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.


Latest News
 

తెల్లవారుజామున చోరీకి యత్నం.. దుండగుడు పరారీ Fri, Mar 29, 2024, 01:03 PM
డా. చిన్నారెడ్డిని కలిసిన విశ్రాంత ఉపాధ్యాయులు Fri, Mar 29, 2024, 12:58 PM
నవీన్ రెడ్డి గెలుపు ఖాయం: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి Fri, Mar 29, 2024, 12:55 PM
పోలింగ్ పై సిబ్బందికి అవగాహన తప్పనిసరి Fri, Mar 29, 2024, 12:54 PM
పోక్సో కేసులో యువకుడికి రిమాండ్ Fri, Mar 29, 2024, 12:54 PM