నూపూర్ శర్మ వ్యాఖ్యలను రిపీట్ చేసిన రాజా సింగ్

byసూర్య | Mon, Aug 15, 2022, 10:01 PM

మునావర్ ఫరూకీ ఏ దేవుడిని మొక్కుతాడో ఆయనపై తాను కూడా కామెంట్స్ చేస్తానంటూ నుపుర్ శర్మ వ్యాఖ్యలను రిపీట్ చేస్తూ...గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ షో కోసం ఈ నెల 20న హైదరాబాద్ వస్తున్న స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూకీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు. 20న ఆయన కామెడీ షో చేస్తే 22న సోషల్ మీడియాలో తన కామెడీ షో స్టార్ట్ అవుతుందన్నారు. సీతారాములపై మునావర్ చాలా నీచంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి ఫరూకీని కొంతమంది పిలుస్తున్నారని, పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తామని చెబుతున్నారని, ఏం కాకుండా చూస్తామని హామీ ఇస్తున్నారని అన్నారు. మరొక్కసారి సీతారాములను తిట్టివెళ్లిపొమ్మని పిలుస్తున్నారని అన్నారు. 


ఆయన హైదరాబాద్‌లో అడుగుపెడితే తమ రియాక్షన్ ఏంటో చూస్తారని ఇప్పటికే హెచ్చరించానని అన్నారు. మునావర్ ఏ దేవుడిని మొక్కుతాడో ఆయనపై తాను కూడా కామెంట్స్ చేస్తానంటూ నుపుర్ శర్మ వ్యాఖ్యలను రిపీట్ చేశారు. ఆయన మొక్కే దేవుడు చిన్న పిల్లను పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాడని తాను కూడా కామెంట్ చేస్తానన్నారు. నుపుర్ శర్మ చేసిన చిన్న కామెంట్‌ దేశం మొత్తం పెద్ద సమస్య అయిందన్నారు. మునావర్ హైదరాబాద్‌లో కాలుపెడితే తన యాక్షన్, రియాక్షన్ చూడాల్సి ఉంటుందని, కాబట్టి అడ్డుకోవాలని డీజీపీ, పోలీస్ కమిషనర్‌లను కోరారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM