మరోసారి సారీ...వెంకట్ రెడ్డికి అద్దంకి దయాకర్ క్ష‌మాప‌ణ‌లు

byసూర్య | Sat, Aug 13, 2022, 09:02 PM

తమ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మరోసారి సారి అంటూ కాంగ్రెస్ పార్టీ నేత అద్దంకి దయాకర్  క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని చండూరులో నిర్వ‌హించిన కాంగ్రెస్ పార్టీ స‌భ‌లో భువ‌న‌గిరి ఎంపీ కోమటిరెడ్డి వెంక‌టరెడ్డిపై తాను చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌కు ఇప్ప‌టికే ఓ ద‌ఫా క్ష‌మాప‌ణ‌లు చెప్పిన అద్దంకి ద‌యాక‌ర్... శ‌నివారం మ‌రోమారు సారీ చెప్పారు. పార్టీకి న‌ష్టం జ‌ర‌గ‌కూడ‌ద‌న్న భావ‌న‌తో మ‌రోమారు కోమ‌టిరెడ్డికి సారీ చెబుతున్నాన‌ని శ‌నివారం అద్దంకి తెలిపారు. భ‌విష్య‌త్తులో మ‌రోమారు తాను ఇలాంటి ప‌రిణామాలకు అవ‌కాశం ఇవ్వ‌బోనంటూ ఆయ‌న పేర్కొన్నారు. త‌న క్ష‌మాప‌ణ‌ల‌ను స్వీక‌రించి కోమ‌టిరెడ్డి పార్టీ కార్యక్ర‌మాల‌కు హాజ‌రు కావాల‌ని అద్దంకి కోరారు. 


చండూరు స‌భ‌లో కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డిపై అద్దంకి ద‌యాక‌ర్ అనుచిత వ్యాఖ్య‌లు చేసిన వెంట‌నే.. అక్క‌డే ఉన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి... అద్దంకికి నోటీసులు ఇవ్వాలంటూ పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీ చైర్మ‌న్ చిన్నారెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీ నుంచి నోటీసులు అంద‌క‌ముందే అద్దంకి కూడా త‌న త‌ప్పు తెలుసుకుని సారీ చెప్ప‌డంతో పాటు నోటీసులు అందాక లిఖిత‌పూర్వ‌కంగా సంజాయిషీ ఇచ్చారు. అయితే పార్టీ నుంచి అద్దంకిని స‌స్పెండ్ చేయాల్సిందేన‌ని కోమ‌టిరెడ్డి ప‌ట్టుబ‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే మ‌రోమారు కోమ‌టిరెడ్డికి అద్దంకి ద‌యాక‌ర్ క్ష‌మాప‌ణ చెప్పారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM