కోమటిరెడ్డి డిమాండ్ పై స్పందించిన రేవంత్ రెడ్డి...సారీ అని వీడియో

byసూర్య | Sat, Aug 13, 2022, 09:01 PM

కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారంపై తాజాగా చర్చసాగుతోంది.కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ టికెట్ ద్వారా ద‌క్కిన మునుగోడు ఎమ్మెల్యే ప‌ద‌వికి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా త‌ద‌నంత‌రం తెలంగాణ కాంగ్రెస్‌లో వ‌రుస‌గా ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ మునుగోడు ప‌రిధిలోని చండూరులో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలోనే భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డిపై పార్టీ నేత అద్దంకి ద‌యాక‌ర్ అనుచిత వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంపై వెనువెంటనే స్పందించిన పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం అద్దంకికి నోటీసులు జారీ చేయ‌గా... ఆ వెంట‌నే ఆయన సారీ చెప్పారు.


అయితే త‌న‌ను కావాల‌నే పార్టీ నేత‌ల‌తో తిట్టించార‌ని కోమ‌టిరెడ్డి వెంక‌టరెడ్డి ఆరోపిస్తూ... టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి త‌న‌కు సారీ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. కోమ‌టిరెడ్డి డిమాండ్ మేర‌కు రేవంత్ రెడ్డి క్ష‌మాప‌ణ చెబుతూ శ‌నివారం ఉద‌యం ఓ వీడియో విడుద‌ల చేశారు. ఈ వీడియోపై తాజాగా స్పందించిన కోమ‌టిరెడ్డి... త‌న‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన అద్దంకి ద‌యాక‌ర్‌ను పార్టీ నుంచి శాశ్వ‌తంగా బ‌హిష్క‌రించిన త‌ర్వాతే రేవంత్ రెడ్డి క్ష‌మాప‌ణ‌పై ఆలోచిస్తాన‌ని అన్నారు. ఉద్య‌మ‌కారుడినైన త‌న‌ను సొంత పార్టీ నేత‌లు అవ‌మానించార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM