అంగరంగ వైభవంగా జాతీయ పతాక ర్యాలీ

byసూర్య | Sat, Aug 13, 2022, 04:33 PM

పటాన్ చేరు మేజర్ న్యూస్ ; స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు పటాన్చెరువు నియోజకవర్గం వ్యాప్తంగా ద్వి సప్తహా కార్యక్రమాలను విజయవంతంగా  నిర్వహిస్తున్నామని  శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం రామచంద్రపురం డివిజన్ లక్ష్మీ గార్డెన్స్ నుండి పటాన్ చేరు డివిజన్ పరిధిలోని మైత్రి స్టేడియం వరకు భారీ జాతీయ పతాక ర్యాలీనీ నిర్వహించారు. వేలాదిమంది పాఠశాలల, కళాశాలల విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది  జాతీయ పతాకాలు చేత  బూని భారత్ మాతాకీ జై, జై జవాన్ జై కిసాన్, మహనీయుల త్యాగాలను స్మరిస్తూ 250 అడుగుల జాతీయ పతాకంతో జాతీయ రహదారిపై నిర్వహించిన ర్యాలీ ప్రతి ఒక్కరిలో జాతీయ భావాన్ని పెంపొందించింది.అనంతరం మైత్రి స్టేడియంలో ఏర్పాటు చేసిన ముగింపు సమావేశంలో శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు.ఎమ్మెల్యే  మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ నాటి ఉద్యమ ఘట్టాలను నేటి తరాలకు తెలియజేస్తూ కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరంగా ఉందన్నారు. జాతీయ పతాక ర్యాలీలో పాల్గొన్న వేలాది మంది విద్యార్థులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పంద్రాగస్టు  సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయన్ని రంగురంగుల దీపాలతో అలంకరించాలని కోరారు. ఆదివారం పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు కట్టపై నియోజకవర్గ స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు, బాణాసంచా తదితర కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, డీఎస్పీ భీమ్ రెడ్డి, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ బాలయ్య, గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అంజయ్య,  వివిధ శాఖల అధికారులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థిని విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM