![]() |
![]() |
byసూర్య | Mon, Aug 08, 2022, 05:31 PM
ఇప్పుడిప్పుడే మాస్కులు, శానిటైజర్లు పక్కనపెట్టి ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో కరోనా మెల్లమెల్లగా తన ప్రభావం చూపడం మొదలయ్యింది. వివరాల్లోకి వెళ్తే మల్కాజిగిరి నియోజకవర్గంలో గల మేడ్చల్ మల్కాజిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో 98 మందిలో గాను 13 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా వైద్యులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది.