పారదర్శకంగా వీఆర్వోల సర్దుబాటు

byసూర్య | Sat, Aug 06, 2022, 02:21 PM

పారదర్శకంగా వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియ పద్ధతిన ఆయా శాఖలకు బదలాయింపు జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ సమక్షంలో సర్దుబాటు ప్రక్రియ కొనసాగినది. రాష్ట్ర రెవెన్యూ శాఖలో గ్రామ రెవెన్యూ అధికారులుగా కొనసాగిన వీఆర్వోలను ఇతర శాఖలలో సర్దుబాటు చేసే ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా పూర్తయ్యింది. జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లి లోని కలెక్టర్ ఛాంబర్ జిల్లా అధికారులు, రెవెన్యూ సిబ్బంది సమక్షంలో నిర్వహించిన ప్రక్రియ పూర్తి పారదర్శకంగా వీడియో రికార్డింగ్తో సహా నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలియజేసినారు.


ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఆయా శాఖల్లో ఉన్న ఖాళీలకు అను గుణంగా వీఆర్వోలను డ్రా పద్ధతిలో కేటాయింపులు జరిపారు. శాఖల వారిగా జిల్లాలో మొత్తం 274 మంది వీఆర్వోలను 40 శాఖల్లో సర్దుబాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి హరిప్రియ, ఏ. ఓ ప్రమీల, జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీధర్, సిపి ఓం ప్రకాష్, సంబంధిత అధికారులు, పాల్గొన్నారు.


Latest News
 

సీఎం కేసీఆర్‌తో సీపీఐ నేతల సమావేశం Fri, Aug 19, 2022, 11:33 PM
ఈ నెల 21న హైదరాబాద్ లో పర్యిటించనున్న అమిత్ షా Fri, Aug 19, 2022, 09:40 PM
హైదరాబాద్ ప్రజలు అలెర్ట్....ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులు రద్దు Fri, Aug 19, 2022, 09:25 PM
సబ్సిడీలను ఎత్తివేసేందుకు కేంద్రం యత్నం: మంత్రి జగదీష్ రెడ్డి Fri, Aug 19, 2022, 09:14 PM
అబార్షన్ వికటించి...యువతి మరణం Fri, Aug 19, 2022, 09:13 PM