మునుగోడు లో గెలిచేది బీసీ ఎమ్మెల్యే మాత్రమే

byసూర్య | Sat, Aug 06, 2022, 02:09 PM

ఉత్తరాది పార్టీల తాబేదారులైన రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డిలు తోడు దొంగలని తమ వ్యాపార ప్రయోజనాల కొరకు మాత్రమే రాజకీయాలు చేస్తున్నారని సదరన్ పొలిటికల్ అకాడమీ అధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ ఆరోపించారు. తార్నాక దక్షిణ భారత రాజకీయ జేఏసీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 30 ఏళ్లు కాంగ్రెస్ ఉప్పు తిని కోట్లకు పడగలెత్తిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మైనింగ్ వ్యాపారుల కోసం మాత్రమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసాడని మునుగోడు ప్రజల కోసం కాదని ఆయన అన్నారు మునుగోడులో 52% ఉన్న బీసీలు గెలవాలా నాలుగు శాతం ఉన్న రెడ్లు గెలవాలా తేల్చుకోవాల్సింది.

మునుగోడు బీసీ ప్రజలేనని ఇప్పటివరకు తెలంగాణలో 93 శాతం ఉన్న బహుజనల ఓట్లను కొల్లగొట్టి కోట్లు సంపాదించిన రేట్లు తిరిగి అధికారాన్ని సంపాదించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికారాన్ని పొందినట్టు తెలంగాణలోనూ పొందాలని చూస్తున్నారని వారి పప్పులు ఉడకవని మునుగోడు ప్రజలు బీసీ ఎమ్మెల్యే ను గెలిపించబోతున్నారని అలాగే తెలంగాణ ప్రజలు బీసీని సీఎం చేయబోతున్నారని ఆయన జోష్యం చెప్పారు. ఈ సమావేశంలో దక్షిణ భారత పరిశోధక విద్యార్థి జేఏసీ నాయకులు దుర్గం. శివ పాల్గొన్నారు.


 


Latest News
 

సీఎం కేసీఆర్‌తో సీపీఐ నేతల సమావేశం Fri, Aug 19, 2022, 11:33 PM
ఈ నెల 21న హైదరాబాద్ లో పర్యిటించనున్న అమిత్ షా Fri, Aug 19, 2022, 09:40 PM
హైదరాబాద్ ప్రజలు అలెర్ట్....ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులు రద్దు Fri, Aug 19, 2022, 09:25 PM
సబ్సిడీలను ఎత్తివేసేందుకు కేంద్రం యత్నం: మంత్రి జగదీష్ రెడ్డి Fri, Aug 19, 2022, 09:14 PM
అబార్షన్ వికటించి...యువతి మరణం Fri, Aug 19, 2022, 09:13 PM