నాడు అమ్మ, నేడు నాన్న...అనాథలుగా మారిన చిన్నారులు

byసూర్య | Sat, Aug 06, 2022, 01:05 PM

విధి ఆ కుటుంబాన్ని వెంటాడింది. నాడు యాక్సిడెంట్ లో తల్లి, నేడు (శుక్రవారం) అకస్మాత్తుగా ఆనారోగ్యంతో తండ్రి మృత్యువాత పడ్డారు. దీంతో ఆ ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. తల్లిదండ్రులను కోల్పోయిన ఆ పిల్లల కన్నీటి శోకం గ్రామస్థులను కలిచివేస్తోంది. విధి ఆడిన నాటకంలో పిల్లలు పావులుగా మిగిలారు. వివరాల ప్రకారం. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామానికి చెందిన దాసరి సత్తయ్య(42), కమల(35) దంపతులకు ఇద్దరు సంతానం. కొడుకు రఘు 9 వ తరగతి, కూతురు కీర్తన 6 వ తరగతి చదువుతున్నారు. సత్తయ్య, కమల కూలి నాలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న క్రమంలో 2018 ఆగస్ట్ 18 నా తల్లి కమల(34) ఉపాధి హామీ పనికి వెళ్లి రోడ్డు పక్కన చెట్లు నాటుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కారు ఢీ కొట్టడంతో మృతి చెందింది.


భార్య మృతి చెందడంతో పిల్లల పోషణ సత్తయ్య పై పడింది. ఇంట్లో తలెత్తిన సమస్యలతో అప్పులు ఎక్కువ కావడంతో సింగపూర్ గల్ఫ్ బాట పట్టాడు. సంవత్సరం పాటుగా అక్కడే పనులు చేసుకుంటున్న సత్తయ్యకు ఆరోగ్యం సహకరించకపోవడంతో సింగపూర్ నుంచి గత పది రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. ఆసుపత్రికి వెళ్లి టెస్ట్ లు చేసుకోగా పచ్చ కామెర్లు అని డాక్టర్లు నిర్ధారించడంతో మెడిసిన్ వాడాడు. దీంతో పరిస్థితి విషమించడంతో శుక్రవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మృతి చెందాడు.


దీంతో ఆ చిన్నారులు గుండెలవిసేలా రోదించారు. నాడు తల్లి ని నేడు తండ్రిని కోల్పోయి కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆ చిన్నారులను చూసి గ్రామస్థులు చలించిపోయారు. ఉన్న ఒక్క కొడుకు మృతితో వృద్ధాప్యంలో ఉన్న అమ్మ నాన్న లు కన్నీరుమున్నీరయ్యారు. నాడు తల్లికి, నేడు తండ్రికి తల కొరివి పెట్టిన కొడుకు రోదన కలచివేసింది. ఇక పిల్లల బారం వృద్ధుల పై పడింది. ప్రభుత్వం ఏమైనా సహాయం చేయాలని వృద్ధులు వేడుకుంటున్నారు.


Latest News
 

ఉప ఎన్నికలు ఎప్పుడూ జరిగిన విజయం మాదే: కవితా Wed, Aug 10, 2022, 09:32 PM
పెళ్లి కొడుకుపై అటు ప్రియురాలు..ఇటు పెళ్లి కూతురు బంధువుల ఆగ్రహం Wed, Aug 10, 2022, 09:31 PM
ప్రేమికులుగా ముద్రవేశారని...మన స్థాపంతో యువతి, యువకుడి ఆత్మహత్య Wed, Aug 10, 2022, 09:31 PM
నేను ఎవరిని తప్పుపట్టేలా మాట్లాడలేదు: పాల్వాయి స్రవంతి రెడ్డి Wed, Aug 10, 2022, 09:30 PM
వరంగల్ లో పోస్టర్ వార్...ఆ రెండు నేతల మధ్య వివాదానికి మరింత ఆజ్యం Wed, Aug 10, 2022, 09:29 PM