రేపు ఎస్సై పరీక్షకు ఆర్మూర్ లో మూడు పరీక్ష సెంటర్లు

byసూర్య | Sat, Aug 06, 2022, 12:58 PM

పోలీసు ఉద్యోగాలకు చెందినటువంటి సబ్ ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీసు ఉద్యోగార్థులకు పోలీసు ఉద్యోగానికి సన్నద్ధమయ్యే వారికి, “ప్రీ ప్రిలిమినరీ” పరీక్ష ఆదివారం నిర్వహించడం జరుగుతుందని ఏసీపీ ప్రభాకర్ రావు తెలిపారు. ఈ క్రింధి పరీక్షా కేంద్రాలలో తేది ఆదివారం నాడు ఉదయము 10 గంటల నుండి 1 గంట వరకు (3 గంటలు) నిర్వహించడం జరుగుతుందన్నారు.


ఆర్మూర్ లో మూడు పరీక్ష కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. క్షత్రియ ఇంజనీరీంగ్ కాలేజ్, చేపూర్ గ్రామ శివారులో గల మెట్ పల్లి రోడ్, ఎన్ హెవ్-63 రోడ్డు పక్కన, సిద్దార్థ డిగ్రీ కాలేజ్, ఆర్టీసీ బస్టాండ్ వెనుకాల, ఆర్మూర్, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, పిప్రి గ్రామం వెళ్ళే దారిలో ఉందన్నారు. అందుకు గాను, ఆర్మూర్ బస్టాండ్, పెర్కిట్ బస్ స్టాండ్ నందు ప్రత్యేక బస్సులు, ఆటోలు పరిమిత చార్జీలతో ఏర్పాటు చేయనైనది. ఆదే విదముగా సందేహాల నివృత్తి కొరకు, ఆర్మూర్ , పెర్కిట్ బస్ స్టాండ్ ల యందు సహాయ కేంద్రాలు (help desk) లను ఏర్పాటు చేయనైనది, కావున అభ్యర్థులు ఏటువంటి సందేహాలు ఉన్నా, సహాయక కేంద్రాలను సంప్రధించగలరు. ఏటువంటి దళారుల చేతులలో పడి మోస పోకూడదు అని తెలిపారు.


Latest News
 

కర్ణాటక రోడ్డు ప్రమాదంలో...హైదరాబాదీల మరణం Mon, Aug 15, 2022, 11:12 PM
పట్టుకొనేందుకు వెళ్లిన తెలంగాణ పోలీసులపై బీహార్ లో నింధితుల కాల్పులు Mon, Aug 15, 2022, 10:02 PM
నూపూర్ శర్మ వ్యాఖ్యలను రిపీట్ చేసిన రాజా సింగ్ Mon, Aug 15, 2022, 10:01 PM
భార్యపై అలిగి లైవ్ లో ఆత్మహత్య చేసుకొన్న వ్యక్తి Mon, Aug 15, 2022, 09:48 PM
మాపై దాడులు జరుగుతుంటే పోలీస్ కమిషనర్ ఏం చేస్తున్నాట్లు...డీజీపీకి ఫోన్ చేసిన బండి సంజయ్ Mon, Aug 15, 2022, 09:30 PM