ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చార్జీలు పెంచాలి

byసూర్య | Sat, Aug 06, 2022, 12:48 PM

నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చార్జీలు పెంచాలని పిడిఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జెఎల్ శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పిడిఎస్యూ ఆధ్వర్యంలో మంచిర్యాల డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఊరు మన బడి పథకంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను చేర్చి సరిపడ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నూతన విద్యా విధానం రద్దు చేయాలని, టీచర్, ఎంఇఓ, డీఈఓ ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యూ జిల్లా అధ్యక్షుడు రెడ్డి చరణ్, నాయకులు విజయ్, మనోహర్, సిద్ధార్థ, సాయి, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఉప ఎన్నికలు ఎప్పుడూ జరిగిన విజయం మాదే: కవితా Wed, Aug 10, 2022, 09:32 PM
పెళ్లి కొడుకుపై అటు ప్రియురాలు..ఇటు పెళ్లి కూతురు బంధువుల ఆగ్రహం Wed, Aug 10, 2022, 09:31 PM
ప్రేమికులుగా ముద్రవేశారని...మన స్థాపంతో యువతి, యువకుడి ఆత్మహత్య Wed, Aug 10, 2022, 09:31 PM
నేను ఎవరిని తప్పుపట్టేలా మాట్లాడలేదు: పాల్వాయి స్రవంతి రెడ్డి Wed, Aug 10, 2022, 09:30 PM
వరంగల్ లో పోస్టర్ వార్...ఆ రెండు నేతల మధ్య వివాదానికి మరింత ఆజ్యం Wed, Aug 10, 2022, 09:29 PM