దేశానికి గొప్ప వ్యక్తులను అందించిన ఓయూ

byసూర్య | Sat, Aug 06, 2022, 11:58 AM

దేశానికి ఎంతో మంది గొప్ప వ్యక్తులను ఉస్మానియా యూనివర్శిటీదేనని సుప్రీంకోర్టు ఛీప్ జస్టీస్ ఎన్వీ రమణ తెలిపారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ వంటి వారు ఉస్మానియా తయారు చేసిన అందించిన వ్యక్తులేనని కోనియాడారు. అయితే తను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేయాలని భావించినప్పటికి తన కోరిక నేరవేరలేదని జస్టీస్ ఎన్వీ రమణ తెలిపారు. ఎంతో చైతన్యం నింపి, సంస్కృతి ఉద్యమాలను నడిపిన ఉస్మానియనను ఎక్కడున్న గుర్తుపెట్టుకుంటామని అన్నారు. మీ తల్లిని, మా భాషని, మీ ప్రాంతాన్ని మరవద్దని విధ్యార్ధులకు పిలుపునిచ్చారాయన. లేదంటే చరిత్ర మిమ్మల్ని క్షమించదని అన్నారు.


ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను శుక్రవారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు ప్రదానం చేశారు వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు. గురువారం శుక్రవారం ఆయన వర్సిటీ, రాష్ట్ర గవర్నర్, ఓయూ చాన్స్లర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ అధ్యక్షతన వర్సిటీ క్యాంపస్ లోని ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే 82వ స్నాతకోత్సవంలో ఈ డాక్టరేట్ను అందజేశారు. ఓయూ 48వ గౌరవ డాక్టరేట్ అని, 21 ఏళ్ల అనంతరం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా దానిని ప్రధానం చేస్తున్నామని వివరించారు. 361 మందికి పీహెచ్ డిగ్రీలు, వివిధ కోర్సుల్లో అత్యధిక మార్కులు సాధించిన 31 మంది విద్యార్థులకు 55 బంగారు పతకాలు అందచేశారు. అంతకు ముందు గవర్నర్ తమిళ్ పై మాట్లాడుతూ సమాజంలో విజయానికి షార్ట్ కట్స్ లేవని అన్నారు.


ప్రతి ఒక్కరు కష్టపడాలి. సమస్యల్ని ఎదురుకోని వాటిని పరిష్కరించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ కాన్వకేషన్ కు ఛాన్స్ లర్ హెూదాలో హజరై ప్రసంగించిన అమే విద్యార్థునుద్దేశించి మాట్లాడారు. రాత్రిళ్ళు ఏ టైం వరకైనా చదవండి, కానీ ఉదయం త్వరగా లేవండని అన్నారు. విధ్యార్ధులు ఖచ్చితంగా సమయ పాలనా పాటించాలని అన్నారు. సాధారణ జీవనం గడిపి అసాధారణ పనులు చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి వ్యక్తిలో మొదటి, రెండు, మూడో సీక్రెట్ హార్డ్ వర్క్ చేయడం అని, వీలైనంత వరకు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని ఆమె సూచించారు. అమ్మ నాన్న చదువు చెప్పే గురువు మర్చిపోయి, ప్రతిదీ గూగుల్ లో వెతుకుంటున్నారని అవేదన వ్యక్తంచేశారు. పెద్ద లక్ష్యాలను పెట్టుకుని దానికనుగుణంగా కష్టపడాలని గవర్నర్ సూచించారు.


Latest News
 

చార్మినార్ పరిసర ప్రాంతాల్లో కార్పొరేటర్ పర్యటన Mon, May 29, 2023, 10:50 AM
గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్ Mon, May 29, 2023, 10:47 AM
శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్సీ Mon, May 29, 2023, 10:43 AM
హైదరాబాద్ లో వర్షం Mon, May 29, 2023, 10:42 AM
అలర్ట్.. అధిక ఉష్ణోగ్రతలు, మరో వైపు వర్షం Mon, May 29, 2023, 10:40 AM