ముఖ్యమంత్రి కేసీఆర్ హరిత తెలంగాణ స్వప్నం సాకారం దేశానికే మార్గదర్శం

byసూర్య | Sat, Aug 06, 2022, 11:57 AM

ముఖ్యమంత్రి కేసీఆర్ హరిత తెలంగాణ స్వప్నం సాకారం దేశానికే మార్గదర్శం అని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ఇండియా చాలెంజ్ ను స్వీకరించి రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు తన పుట్టినరోజు సందర్భంగా మల్లాపూర్ డివిజన్ లోని ఎలిఫెంట్ చౌరస్తా లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సుభాష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ హరిత తెలంగాణ స్వప్నం సాకారం దిశగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది. అన్నారు. గ్రీన్ఇండియా చాలెంజ్ చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ అభినందనీయులు. దీని ద్వారా తెలంగాణ పచ్చని తెలంగాణ దిశగా ముందుకు వెళుతుంది. తెలంగాణ దేశానికే మార్గదర్శంగా నిలుస్తుందనీ తెలిపారు.


హరితహరం స్పూర్తితో. కొనసాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి గ్రీన్ ఇండియా చాలెంజ్ లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి ప్రత్యేక దన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పల్లా కిరణ్ కుమార్ రెడ్డి, తాండ వాసుదేవ్ గౌడ్, తీగుళ్ల శ్రీనివాస్ గౌడ్, ప్రవీణ్, బుసాని రఘు, అల్లాడి కృష్ణ యాదవ్, బొక్క ప్రతాప్ , రాము, శేఖర్, శ్యామ్, ఉపేందర్, రాపోలు సతీష్, శ్రీకాంత్, ప్రవీణ్, శ్రీశైలం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఉప ఎన్నికలు ఎప్పుడూ జరిగిన విజయం మాదే: కవితా Wed, Aug 10, 2022, 09:32 PM
పెళ్లి కొడుకుపై అటు ప్రియురాలు..ఇటు పెళ్లి కూతురు బంధువుల ఆగ్రహం Wed, Aug 10, 2022, 09:31 PM
ప్రేమికులుగా ముద్రవేశారని...మన స్థాపంతో యువతి, యువకుడి ఆత్మహత్య Wed, Aug 10, 2022, 09:31 PM
నేను ఎవరిని తప్పుపట్టేలా మాట్లాడలేదు: పాల్వాయి స్రవంతి రెడ్డి Wed, Aug 10, 2022, 09:30 PM
వరంగల్ లో పోస్టర్ వార్...ఆ రెండు నేతల మధ్య వివాదానికి మరింత ఆజ్యం Wed, Aug 10, 2022, 09:29 PM