![]() |
![]() |
byసూర్య | Fri, Aug 05, 2022, 09:32 PM
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరామన్‌కు తెలంగాణలోని ప్రతిష్ఠాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. శుక్రవారం వర్సిటీ ఆవరణలోని ఠాగూర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన 82వ స్నాతకోత్సవంలో భాగంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జస్టిస్ ఎన్వీ రమణకు ఓయూ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ ఎన్వీ రమణ ఈ నెలలోనే ఆ పదవి నుంచి పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో ఓయూ ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.