ఇల్లు కూలిన పేద కుటుంబానికి ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆర్థిక సాయం అందజేత

byసూర్య | Fri, Aug 05, 2022, 02:15 PM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్బషీరాబాద్ లోని ఎమ్మెల్యే నివాసంలో తెలంగాణ రాష్ట్ర కురుమ యువ చైతన్య సమితి సభ్యులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చింతల్ డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ లో నివాసం ఉంటున్న స్వరూప ఇల్లు ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు కూలడంతో ఎమ్మెల్యే పది వేల ఆర్థిక సాయాన్ని అందించారు. కాగా కెవైసిఎస్ సభ్యులు కూడా ముందుకొచ్చి రూ. 30 వేల ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా తన నివాసం వద్ద కార్యాలయంలో స్వరూపకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కొండే శ్రీకాంత్ కురుమ, ఫీర్జాది గూడ కార్పొరేటర్ కౌడే పోచయ్య కురుమ, సీనియర్ నాయకులు సయ్యద్ రషీద్, మారయ్య, ప్రధాన కార్యదర్శి గోరిగే నర్సింహా, కొత్తూరి చంద్రమౌళి కురుమ, గౌడ్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

కర్ణాటక రోడ్డు ప్రమాదంలో...హైదరాబాదీల మరణం Mon, Aug 15, 2022, 11:12 PM
పట్టుకొనేందుకు వెళ్లిన తెలంగాణ పోలీసులపై బీహార్ లో నింధితుల కాల్పులు Mon, Aug 15, 2022, 10:02 PM
నూపూర్ శర్మ వ్యాఖ్యలను రిపీట్ చేసిన రాజా సింగ్ Mon, Aug 15, 2022, 10:01 PM
భార్యపై అలిగి లైవ్ లో ఆత్మహత్య చేసుకొన్న వ్యక్తి Mon, Aug 15, 2022, 09:48 PM
మాపై దాడులు జరుగుతుంటే పోలీస్ కమిషనర్ ఏం చేస్తున్నాట్లు...డీజీపీకి ఫోన్ చేసిన బండి సంజయ్ Mon, Aug 15, 2022, 09:30 PM