మరోసారి వరద నీటిలో మునిగిన వంతెన

byసూర్య | Fri, Aug 05, 2022, 01:52 PM

జగిత్యాల పట్టణంలోని గోవిందుపల్లె వెంకటాద్రినగర్ వంతెన శుక్రవారం మరోసారి నీట మునిగింది. ఈ కారణంగా కాలనీకి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వర్షాకాలం సీజన్లో పలుమార్లు వెంకటాద్రి నగర్ వంతెన వరదనీటిలో మునిగి కాలనీకి – జగిత్యాలకు అనేక సార్లు రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన పై వరద నీరు ప్రవహిస్తున్న కారణం చేత స్థానికులు కొట్టుకుపోయే ప్రమాదం ఉన్న దృష్ట్యా జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో టౌన్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపేశారు. ఈ క్రమంలోనే ఈ వంతెన మరోసారి వరద నీటిలో మునిగిపోవడంతో ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది.


Latest News
 

ఉప ఎన్నికలు ఎప్పుడూ జరిగిన విజయం మాదే: కవితా Wed, Aug 10, 2022, 09:32 PM
పెళ్లి కొడుకుపై అటు ప్రియురాలు..ఇటు పెళ్లి కూతురు బంధువుల ఆగ్రహం Wed, Aug 10, 2022, 09:31 PM
ప్రేమికులుగా ముద్రవేశారని...మన స్థాపంతో యువతి, యువకుడి ఆత్మహత్య Wed, Aug 10, 2022, 09:31 PM
నేను ఎవరిని తప్పుపట్టేలా మాట్లాడలేదు: పాల్వాయి స్రవంతి రెడ్డి Wed, Aug 10, 2022, 09:30 PM
వరంగల్ లో పోస్టర్ వార్...ఆ రెండు నేతల మధ్య వివాదానికి మరింత ఆజ్యం Wed, Aug 10, 2022, 09:29 PM