అర్హులైన పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలి

byసూర్య | Fri, Aug 05, 2022, 01:49 PM

అర్హులైన పేద ప్రజలు అందరికీ ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్ అన్నారు. సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సమావేశం భిక్కనూరు మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్ మాట్లాడుతూ, జిల్లాలో అర్హులైన పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఓట్ల కోసం అనేక హామీలు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం దమ్ముంటే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందరికి ఇవ్వాలన్నారు. లేకపోతే పేదోడికి కనీసం ఇంటి స్థలం కేటాయించిన వాటిలో పూరి గుడిసెలు, రేకుల్లో వేసుకుని తల దాసుకుంటారని అన్నారు.


తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అన్నారు. భిక్నూర్ మండలం జంగంపల్లి గ్రామంలో మండలంలో మిగులుగా ఉన్న ప్రభుత్వ భూములను ఇళ్ల స్థలాలు కేటాయించాలని లేకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ఆక్రమిస్తమని హెచ్చరించారు. ఇప్పటికే నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే పంచాలన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చంద్రశేఖర్, కొత్త నర్సింలు, రవీందర్, సురేష్, మోతిరాంనాయక్, ఖలీల్, అరుణ్ పాల్గొన్నారు.


Latest News
 

ఉప ఎన్నికలు ఎప్పుడూ జరిగిన విజయం మాదే: కవితా Wed, Aug 10, 2022, 09:32 PM
పెళ్లి కొడుకుపై అటు ప్రియురాలు..ఇటు పెళ్లి కూతురు బంధువుల ఆగ్రహం Wed, Aug 10, 2022, 09:31 PM
ప్రేమికులుగా ముద్రవేశారని...మన స్థాపంతో యువతి, యువకుడి ఆత్మహత్య Wed, Aug 10, 2022, 09:31 PM
నేను ఎవరిని తప్పుపట్టేలా మాట్లాడలేదు: పాల్వాయి స్రవంతి రెడ్డి Wed, Aug 10, 2022, 09:30 PM
వరంగల్ లో పోస్టర్ వార్...ఆ రెండు నేతల మధ్య వివాదానికి మరింత ఆజ్యం Wed, Aug 10, 2022, 09:29 PM