చిన్నారితో సహా ముగ్గురు ఆత్మహత్య

byసూర్య | Fri, Aug 05, 2022, 01:21 PM

సంగారెడ్డి పటాన్ చెరు మండలం భానూర్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన చిన్నారితో సహా ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన బీడీఎల్ భానూర్ పోలీ స్స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకున్నది. సీఐ వినాయక్ రెడ్డి కథనం ప్రకారం. గజేంద్ర కుసుబు (30), తన భార్య రేఖ(28), కూతురు సోనం (2)తో కలసి కొన్ని నెలల క్రితం మధ్యప్రదేశ్ నుంచి భానూ ర్కు వలస వచ్చారు. స్థానికంగా ఒక పరిశ్రమలో ఉపాధి పొందుతున్నారు. ఈ మధ్యకాలంలో వారి పక్కింట్లో తమ్ముడు వరుసయ్యే వాసుదేవ (27) కిరా యికి వచ్చాడు. బుధవారం రోజు రాత్రి గజేంద్ర కుసుబు తన ఇంట్లో నిద్రిస్తుండగా, మరిది వాసుదేవ, వదిన రేఖ, పాప సోనంలు ఒకే చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం నిద్రలేచి చూసిన గజేంద్ర కుసుబు ముగ్గురు మృతిచెందడంతో పోలీసు లకు ఫిర్యాదు చేశాడు. బీడీఎల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


వివాహేతర సంబంధమే కారణమా.?


మధ్యప్రదేశ్లో గంజేంద్ర, రేఖ ఉన్న సమయంలో మరిది వాసుదేవతో రేఖకు వివాహేతర సంబంధం ఉందని బయటపడినట్లు సన్నిహితులు పేర్కొన్నారు. అక్కడ పంచాయితీ నిర్వహించి వాసుదేవను పెద్దలు మందలించారని సమాచారం. అక్కడి నుంచి వచ్చిన గజేంద్ర, రేఖ భానూర్లో కాపురం పెట్టారు. ఆ తరువాత కూడా రేఖ పిలవడంతో వాసుదేవ మళ్లీ భానూర్కు వచ్చి పక్కింట్లో మకాం పెట్టాడు. మరిది, వది లన మధ్య సాన్నిహిత్యం కొనసాగుతున్నట్లుగా ప్రచారంలో ఉంది. బుధవారం అర్ధ రాత్రి ఏమి జరిగిందో కాని వాసుదేవ, రేఖ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారు ముందుగా రేఖ కూతురు సోనంను చంపి అదే చీరకు చిన్నారి మృతదేహాన్ని వేళాడదీశారు. ఒకే చీరకు ముగ్గురు ఉరేసుకుని వేళాడుతూ విగతజీవులుగా కనిపించారు. వాసుదేవ, రేఖల మధ్య వివాహేతర సంబంధమే ఇంతటి దారుణానికి కారణమయ్యిందా.? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఇంట్లో ఉన్న భర్తకు తెలియదా? అనేది స్థానికంగా స్థానికంగా అనుమానం వ్యక్తమవుతున్నది. ఇది ఆత్మహత్యా లేదా హత్యా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.


Latest News
 

అదే జరిగితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: మంత్రి కోమటిరెడ్డి Wed, Apr 24, 2024, 07:58 PM
ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితపై ఈడీ కీలక విషయాలు.. బెయిల్ పిటిషన్ రిజర్వ్ Wed, Apr 24, 2024, 07:53 PM
సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌దే గెలుపు.. ఆ సెంటిమెంట్ రిపీట్ కాబోతుంది: రేవంత్ రెడ్డి Wed, Apr 24, 2024, 07:49 PM
తుపాకీ మిస్ ఫైర్.. సీఆర్‌పీఎఫ్‌ డీస్పీపీ మృతి Wed, Apr 24, 2024, 07:42 PM
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ప్రయాణాలు సాగించేవారికి గుడ్‌‍న్యూస్ Wed, Apr 24, 2024, 07:37 PM