వీధి కుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయం

byసూర్య | Fri, Aug 05, 2022, 12:58 PM

మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని దామరచర్ల మండల కేంద్రం ఎర్రనామ్ కాలనీలో గురువారం వీధి కుక్క దాడిలో నితిన్ అనే ఐదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు పరిశీలిస్తే. నరేష్, భవానీల కుమారుడు నితిన్ స్నేహితులతో కలిసి వీధిలో ఆడుకుంటుండగా ఓ కుక్క నితిన్ ని నోటితో బలంగా కరిచింది. దీంతో దవడ భాగంలో పెద్ద గాయం ఏర్పడింది. గమనించిన తల్లి దండ్రులు హుటా హుటిన దామరాచర్ల పిహెచ్సీ కి తరలించగా నల్గొండ వెళ్లాలని సూచించారు.


అక్కడికి వెళ్లేసరికి పరిస్థితి విషమించడంతో నల్లగొండ డాక్టర్లు హైదరాబాద్కు పంపించడం జరిగింది. పేదరికంలో ఉన్న నరేష్, భవానీలకు వైద్య ఖర్చుల కోసం గ్రామస్తులు ఆర్థిక సహాయం చేశారు. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువ అయ్యిందని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Latest News
 

ఉప ఎన్నికలు ఎప్పుడూ జరిగిన విజయం మాదే: కవితా Wed, Aug 10, 2022, 09:32 PM
పెళ్లి కొడుకుపై అటు ప్రియురాలు..ఇటు పెళ్లి కూతురు బంధువుల ఆగ్రహం Wed, Aug 10, 2022, 09:31 PM
ప్రేమికులుగా ముద్రవేశారని...మన స్థాపంతో యువతి, యువకుడి ఆత్మహత్య Wed, Aug 10, 2022, 09:31 PM
నేను ఎవరిని తప్పుపట్టేలా మాట్లాడలేదు: పాల్వాయి స్రవంతి రెడ్డి Wed, Aug 10, 2022, 09:30 PM
వరంగల్ లో పోస్టర్ వార్...ఆ రెండు నేతల మధ్య వివాదానికి మరింత ఆజ్యం Wed, Aug 10, 2022, 09:29 PM