దళిత బంధు యూనిట్లు ఎమ్మెల్యే అందజేత

byసూర్య | Fri, Aug 05, 2022, 12:50 PM

శంషాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ దళితబంధు యూనిట్లను అందజేశారు. పిల్లోనిగూడ, గండిగూడ, రామంజాపూర్, పెద్దతూప్ర గ్రామాల్లోని పలువురు లబ్దిదారులకు కార్లు మంజూరయ్యాయి. వీటిని ఎమ్మెల్యే చేతుల మీదుగా వారికి పంపిణీ చేశారు. ఈ పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని వారి కుటుంబాలు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మ, జెడ్పీటీసీ తన్వీరాజు, సర్పంచ్ బుచ్చమ్మ, ఎంపీటీసీ సరితారవీందర్, ఉప సర్పంచ్ కృష్ణ, టీఆర్ఎస్ నాయకులు జుర్కి రమేష్, శ్రీధర్ గౌడ్, మహేష్, శ్రీశైలం, మల్లేష్, చింటూ, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఉప ఎన్నికలు ఎప్పుడూ జరిగిన విజయం మాదే: కవితా Wed, Aug 10, 2022, 09:32 PM
పెళ్లి కొడుకుపై అటు ప్రియురాలు..ఇటు పెళ్లి కూతురు బంధువుల ఆగ్రహం Wed, Aug 10, 2022, 09:31 PM
ప్రేమికులుగా ముద్రవేశారని...మన స్థాపంతో యువతి, యువకుడి ఆత్మహత్య Wed, Aug 10, 2022, 09:31 PM
నేను ఎవరిని తప్పుపట్టేలా మాట్లాడలేదు: పాల్వాయి స్రవంతి రెడ్డి Wed, Aug 10, 2022, 09:30 PM
వరంగల్ లో పోస్టర్ వార్...ఆ రెండు నేతల మధ్య వివాదానికి మరింత ఆజ్యం Wed, Aug 10, 2022, 09:29 PM