విలాస జీవితం కోసం...దోంగగా మారిన ఎంబీఏ

byసూర్య | Wed, Jul 06, 2022, 05:48 PM

ఉన్నత చదవులు చదివా ఎంతో మంది నేటికీ నిరుద్యోగులుగా ఉన్నారు. కానీ వారెవ్వరూ దొంగలుగా మారలేదు. స్వశక్తితో బతుకుతున్నారు. కానీ ఎంబీఏ చదివినా ఉద్యోగం రాలేదని ఓ వ్యక్తి దొంగగా మారాడు. ఖాళీగా ఉంటూ జల్సాలకు అలవాటు పట్టాడు. అందుకు డబ్బులు అవసరం కావడంతో దొంగగా మారాడు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడ్డాడు. అనేకసార్లు పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లొచ్చినా బుద్ధి మారలేదు. మళ్లీ దొంగతనం చేయడం.. పోలీసులకు పట్టుబడటం.. జైలుకెళ్లి రావడం.. ఇదే అతడికి అలవాటైపోయింది. ఎంబీఏ చదివి గజదొంగగా మారిని ఆ వ్యక్తే శ్రీకాకుళంలోని వెంకటపాలేనికి చెందిన మిక్కిలి వంశీ.


విలాసాలకు అలవాటుపడిన వంశీ పదేళ్లుగా దొంగతనాల్లో ఆరితేరాడు. తాళం వేసి ఉన్న ఇల్లు కనిపిస్తే చాలు దోచేయడం అతడికి అలవాటు. ఇలా అతడిపై తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 200కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇటీవల హైదరాబాద్‌లోని గాంధీనగర్, బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చోరీ కేసులను పోలీసులు దర్యాప్తు కొనసాగించగా నిందితుడు ఒక్కడే అని తేలింది. దీంతో వంశీ కోసం గాలించిన పోలీసులు ఎట్టకేలకు అతడిని అరెస్ట్ చేశారు. గాంధీనగర్‌లో ఓ ఇంట్లో చోరీకి పాల్పడడంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి స్విఫ్ట్ కారు, రూ.3లక్షల నగదు, 190 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. వంశీపై పీడీయాక్ట్ నమోదు చేసి విచారణ చేపట్టారు.


Latest News
 

ప్రజా సంగ్రామ యాత్రలో రైతుగా మారిన బండి సంజయ్ Sat, Aug 13, 2022, 09:03 PM
మరోసారి సారీ...వెంకట్ రెడ్డికి అద్దంకి దయాకర్ క్ష‌మాప‌ణ‌లు Sat, Aug 13, 2022, 09:02 PM
కోమటిరెడ్డి డిమాండ్ పై స్పందించిన రేవంత్ రెడ్డి...సారీ అని వీడియో Sat, Aug 13, 2022, 09:01 PM
మునుగోడు నియోజకవర్గంలో అజాది కా గౌరవ్ యాత్ర Sat, Aug 13, 2022, 06:12 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం Sat, Aug 13, 2022, 04:55 PM