హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు...అలజడిలో భాగ్యనగరం

byసూర్య | Wed, Jul 06, 2022, 05:47 PM

అసాంఘిక శక్తులకు హైదరాబాద్ నిలయంగా మారుతోందన్న ఆరోపణలు గతం నుంచివున్నాయి. మరోసారి హైదరాబాద్ ప్రాంతం చర్చాంశనీయంగా మారింది. ఇదిలావుంటే దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉదయ్‌పూర‌లో టైలర్ కన్హయ్య హత్య కేసు లింకులు హైదరాబాద్‌లో బయటపడుతున్నాయి. ఈ కేసును విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్త ఎన్ఐఏ ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేయగా.. బీహార్‌కు చెందిన మరో వ్యక్తిని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్‌ సంతోష్‌నగర్‌లోని లక్కీ హోటల్‌ సమీపంలో తలదాచుకుంటున్న అతడిని గుర్తించిన ఎన్ఐఏ అధికారులు మంగళవారం అరెస్ట్ చేసి విచారణ నిమిత్తం రాజస్థాన్ తరలించారు.


మరోవైపు కన్హయ్య హత్యకేసులో నిందితులుగా ఉన్న మహమ్మద్ గౌస్, అట్టారి గతంలో పాకిస్థాన్‌లోని కరాచీ నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. 2017-2018లో వారు కొంతకాలం హైదరాబాద్‌లో ఉన్నట్లు విచారణలో తేలింది. కరాచీకి చెందిన దావత్ ఏ ఇస్లామియా కోసం వీరు హైదరాబాద్‌కి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కన్హయ్య హత్య కేసులో అరెస్టయిన కటారి సెల్‌ఫోన్‌ని స్వాధీనం చేసుకున్న పోలీసులకు కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది.


మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా.. ఆమెకు మద్దతుగా కన్హయ్య వాట్సాప్ స్టేటస్‌ పెట్టుకున్నాడు. దీంతో అతడిపై కక్షగట్టిన ఇద్దరు వ్యక్తులు కన్హయ్యను దారుణంగా హత్య చేశారు. ఈ దారుణాన్ని వీడియో తీసిన నిందితులు.. అనంతరం సెల్ఫీ వీడియా ద్వారా ప్రధాని మోదీకి కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయితే హత్య చేసి పారిపోతున్న వీరిని పోలీసులు వెంబడించి అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఓ నిందితుడిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేయడంతో నగరవాసులు ఉలిక్కిపడ్డారు.


Latest News
 

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు Wed, Apr 24, 2024, 03:15 PM
యాదాద్రిలో ఎంపీ అభ్యర్థి చామల ప్రత్యేక పూజలు Wed, Apr 24, 2024, 02:38 PM
రామంతపూర్ డివిజన్ లో ఖాళీ అవుతున్న బిఆర్ఎస్ Wed, Apr 24, 2024, 02:31 PM
ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా Wed, Apr 24, 2024, 01:52 PM
సెకండియర్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ 34 వ స్థానం Wed, Apr 24, 2024, 01:49 PM