ఆవిషయంలో జోక్యం చేసుకొని...తెలంగాణలో శాంతి భద్రతలు రక్షించండి: కేసీఆర్ కు రఘురామ లేఖ

byసూర్య | Wed, Jul 06, 2022, 05:46 PM

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. తనను, తన కుటుంబాన్ని హత్య చేసేందుకు కుట్ర జరిగిందని ఆయన ఆ లేఖలో ఆరోపించారు. అందుకోసమే హైదరాబాద్‌ ఎమ్మార్‌ బౌల్డర్‌ హిల్స్‌లోని తన నివాసం సమీపంలో పదే పదే రెక్కీలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. 


జులై 4న తన ఇంటి సమీపంలోని కొందరు రెక్కీ నిర్వహిస్తుండగా అందులో ఒకరిని సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది పట్టుకున్నారని... అతడిని ప్రశ్నిస్తే ఏపీ ఇంటెలిజెన్స్‌కు చెందిన బాషా అని చెప్పాడని రఘురామ తన లేఖలో తెలిపారు. ఐడీ కార్డు అడిగితే చూపించలేదని, ఉన్నతాధికారుల వివరాలుకూడా చెప్పలేదని పేర్కొన్నారు. దీంతో అతడిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించామని.. కానీ ఏపీ పోలీసులకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మద్దతిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని రఘురామ ఆరోపించారు. ఈ వ్యవహారంపై తగిన చర్యలు తీసుకుని తెలంగాణలో శాంతి భద్రతలు రక్షించాలని లేఖలో కోరారు.


మరోవైపు విధి నిర్వహణలో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ ఫరూక్‌పై దాడి చేసిన కేసులో ఎంపీ రఘురామ కృష్ణంరాజుతో పాటు ఆయన కుమారుడు భరత్‌, పీఏ శాస్త్రి, సీఆర్‌పీఎఫ్‌ ఏఎస్‌ఐ, కానిస్టేబుల్‌పై గచ్చిబౌలి పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు కానిస్టేబుల్‌ ఫరూక్‌పై దాడికి దిగిన సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిని ఉన్నతాధికారులు సస్పెండు చేసినట్లు అమరావతిలోని ఏపీ పోలీసు విభాగం ప్రకటించింది. అయితే రఘురామ ఇంటి వద్ద ఏపీ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ ఫరూక్‌ ఎందుకు ఉన్నాడన్న విషయమై గచ్చిబౌలి పోలీసులు, ఏపీ పోలీసుల వివరణ భిన్నంగా ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంపీ రఘురామ ఇంటివద్ద కానిస్టేబుల్‌ ఫరూక్‌ నిఘా విధులు నిర్వర్తిస్తున్నారని గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌ చెబుతుండగా ఫరూక్‌ విధులకు, రఘురామకృష్ణరాజు ఇంటితో ఎలాంటి సంబంధం లేదని ఏపీ పోలీసులు చెబుతున్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM