సెటైరికల్ ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్

byసూర్య | Wed, Jul 06, 2022, 04:01 PM

గృహావసరాల కోసం వినియోగించే వంటగ్యాస్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెంచి చమురు సంస్థలు షాక్ ఇచ్చాయి. సామాన్యులపై ఒక్కో ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్‌‌పై 50 రూపాయల భారాన్ని మోపాయి. అంతేకాదు దీనితో పాటు అయిదు కేజీల సిలిండర్ల ధరలలో కూడా 18 రూపాయల మేర పెరుగుదల కనిపించింది. ఇక వాణిజ్య అవసరాల కోసం వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరలను స్వల్పంగా తగ్గించాయి. తాజాగా పెరిగిన వంట గ్యాస్ ధరలతో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి రూపాయలు దాటేసింది.

దేశీయంగా 14. 2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధరలు నేటి నుంచి రూ. 50 చొప్పున పెరిగాయని, దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ. 1053గా ఉందని, 5 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 18 పెరిగిందని, 19కేజీల వాణిజ్య సిలిండర్ ధర స్వల్పంగా రూ. 8. 50 తగ్గిందని ఒ ట్వీట్ ను ఆయన జత చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను తరచు తనదైన శైలిలో ఎండగడుతున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా కేంద్ర బీజేపీ సర్కార్ పై నిత్యం విరుచుకుపడుతున్నారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM