మంచి రోజులొచ్చాయి..గ్యాస్ ధరలు పెరిగాయి: కేటీఆర్

byసూర్య | Wed, Jul 06, 2022, 02:30 PM

మంచి రోజులు (అచ్చే దిన్) వచ్చాయి. అందరికీ శుభాకాంక్షలు. గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 పెరిగి... రూ. 1,050 దాటింది. ఇది అందరికీ మోదీ ఇచ్చిన బహుమతి అని తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వంట గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగిన సంగతి తెలిసిందే. 14 కేజీల సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం రూ. 50 పెంచింది. తాజా పెంపుతో హైదరాబాద్ లో రూ. 1,055గా ఉన్న సిలిండర్ ధర రూ. 1,105కి చేరుకుంది. ఢిల్లీలో సిలిండర్ ధర రూ. 1,053కి చేరుకుంది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. 


ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై తెలంగాణ మంత్రి విమర్శలు గుప్పించారు. 'మంచి రోజులు (అచ్చే దిన్) వచ్చాయి. అందరికీ శుభాకాంక్షలు. గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 పెరిగి... రూ. 1,050 దాటింది. ఇది అందరికీ మోదీ ఇచ్చిన బహుమతి' అని ట్వీట్ చేశారు. మరోవైపు, గ్యాస్ ధరను మరోసారి పెంచడంతో సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Latest News
 

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి Thu, Apr 18, 2024, 02:01 PM
ఎన్నికల ప్రచార శంఖారావాన్ని ప్రారంబించిన భీం భరత్ Thu, Apr 18, 2024, 02:00 PM
మనోవేదనకు గురై యువతి సూసైడ్ Thu, Apr 18, 2024, 01:55 PM
బిజెపి అభ్యర్థి తరఫున ఒక సెట్ నామినేషన్ దాఖలు Thu, Apr 18, 2024, 01:53 PM
గదరాలతండ వాసుల నరకయాతన Thu, Apr 18, 2024, 01:52 PM