టీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్

byసూర్య | Tue, Jul 05, 2022, 12:33 PM

రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ లో వర్గ పోరు భగ్గుమంది. మహేశ్వరం నియోజకవర్గం మాజీ ఎమ్యెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై డైరెక్ట్ అటాక్ కు దిగారు.  మంత్రి సబితను కబ్జా కోరని ఆరోపించారు. మీరుపేటను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమాలను చూస్తు ఊరుకోనని. ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించారు. మహేశ్వరం నియోజకవర్గంలో భూ కబ్జాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రోత్సహిస్తున్నారని తీగల ఆరోపించారు. ప్రభుత్వ భూములను స్వాహా చేస్తున్నారని అన్నారు. చెరువులు, స్కూల్ జాగాలను వదలడం లేదంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ట్రంక్ లైన్ పనులు ఇంకా పూర్తి చేయలేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి సబిత గెలవలేదన్న తీగల కృష్ణారెడ్డి. మంత్రి అవినీతికి సంబంధించిన పూర్తి వివరాలను సీఎం కేసీఆర్ కు అందిస్తానని చెప్పారు.


సబితతో తాడో పేడో తేల్చుకుంటానని తీగల కృష్ణారెడ్డి హెచ్చరించారు. మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబిత, మాజీ ఎమ్మె్ల్యే తీగల కృష్ణారెడ్డి మధ్య కొంత కాలంగా విభేదాలు ఉన్నాయి. 2014లో టీడీపీ నుంచి మహేశ్వరం ఎమ్మెల్యేగా గెలిచారు తీగల కృష్ణారెడ్డి. తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన తీగల. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే 2019లో సబిత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తర్వాత మంత్రి అయ్యారు. సబిత కారెక్కినప్పటి నుంచి తీగలతో ఆమెకు విభేదాలు వచ్చాయి. మహేశ్వరం నియోజకవర్గంలో సబిత, తీగల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. మొదటి నుంచి టీఆర్ఎస్ లో ఉన్న నేతలను పట్టించుకోకుండా. కాంగ్రెస్ నుంచి తనతో వచ్చిన వాళ్లకే సబిత ప్రాధాన్యతగతంలో చాలా సార్లు సబిత తీరుపై ఓపెన్ గానే విమర్శలు చేశారు తీగల. దీంతో తీగల పార్టీ మారుతారనే ప్రచారం సాగుతోంది. కాని తీగల మాత్రం ఖండిస్తూ వస్తున్నారు.


 


Latest News
 

ఇసుక టిప్పర్ పట్టివేత Thu, Apr 18, 2024, 10:39 AM
నేడు నామినేషన్ వేయనున్న ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి Thu, Apr 18, 2024, 10:38 AM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Apr 18, 2024, 10:24 AM
లోక్ సభ ఎన్నికల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలి Thu, Apr 18, 2024, 10:23 AM
కేదార్నాథ్ యాత్రికుల సౌకర్యార్థం అన్నప్రసాదం వితరణ Thu, Apr 18, 2024, 10:11 AM