భాగ్య నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

byసూర్య | Tue, Jul 05, 2022, 11:42 AM

భాగ్య నగరం బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ వేడుకల సందర్భంగా రెండు రోజుల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. గ్రీన్‌ల్యాండ్స్, మాతా టెంపుల్, సత్యం థియేటర్ నుండి ఫతే నగర్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ఎస్‌ఆర్‌నగర్‌ టీ జంక్షన్‌ వద్ద, ఎస్‌ఆర్‌నగర్‌ కమ్యూనిటీ హాల్‌, అభిలాషా టవర్స్ – బీకేగూడ క్రాస్ రోడ్ – శ్రీరామ్ నగర్ క్రాస్‌రోడ్స్ – సనత్ నగర్ నుంచి ఫతే నగర్ రోడ్డు వైపు మళ్లించనున్నారు. ఫతేనగర్‌ ఫ్లై ఓవర్‌ నుంచి బల్కంపేట వైపు వెళ్లే వాహనాలకు అనుమతించరు. కొత్త వంతెన వద్ద కట్టమైసమ్మ దేవాలయం-బేగంపేట వైపు మళ్లించనున్నారు. గ్రీన్‌ల్యాండ్స్ – బకుల్ అపార్ట్‌మెంట్లు – ఫుడ్ వరల్డ్ నుంచి వచ్చే ట్రాఫిక్‌కు బల్కంపేట్ వైపు అనుమతి ఉండదని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.
ఫుడ్ వరల్డ్ క్రాస్‌రోడ్‌లో సోనాబాయి టెంపుల్ – సత్యం థియేటర్ – మైత్రీవనం నుంచి ఎస్‌ఆర్‌నగర్‌ టీ జంక్షన్‌ వైపు మళ్లించనున్నారు. బేగంపేట, కట్టమైసమ్మ దేవాలయం నుంచి బల్కంపేట్ వైపు వచ్చే వాహనదారులకు అనుమతి ఉండదని, గ్రీన్‌ల్యాండ్స్ – మాతా టెంపుల్ – సత్యం థియేటర్ – ఎస్‌ఆర్ నగర్ టీ జంక్షన్ ఎడమ మలుపులో ఎస్‌ఆర్‌నగర్‌ కమ్యూనిటీ హాల్ వైపు మళ్లించనున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు పేర్కొన్నారు. ఎస్‌ఆర్‌నగర్‌ టీ జంక్షన్‌ నుంచి ఫతేనగర్‌ వరకు అన్ని సబ్‌ లైన్లు, లింక్‌రోడ్లను మూసివేయనున్నట్లు తెలిపారు.


Latest News
 

ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్నాకేంద్రమంత్రులు, గోవా సీఎం Tue, Apr 16, 2024, 10:23 PM
సుర్రుమంటున్న సూరీడు.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు, రెండ్రోజులు పెరగనున్న ఎండలు Tue, Apr 16, 2024, 08:25 PM
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ. 10 వేలు, అకౌంట్లలోకి డబ్బులు Tue, Apr 16, 2024, 08:19 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ సమయాల్లో, ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోవటం పక్కా Tue, Apr 16, 2024, 08:12 PM
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం.. భక్తులందరికీ ఉచిత దర్శనం Tue, Apr 16, 2024, 08:07 PM