మోదీ గారి మిత్రధర్మం చూశారుగా...బీజేపీ, టీఆర్ఎస్ భాయిభాయి: రేవంత్ రెడ్డి

byసూర్య | Mon, Jul 04, 2022, 12:17 AM

మోదీ గారి మిత్రధర్మం చూశారుగా...బీజేపీ, టీఆర్ఎస్ భాయిభాయి అని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా సికింద్రాబాద్ లో విజయ సంకల్ప సభ నిర్వహించడం తెలిసిందే. ఈ సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రాశస్త్యాన్ని, తాము చేసిన, చేయబోయే అభివృద్ధిని గురించి మాత్రమే మాట్లాడారు. ఇతర బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ ను, టీఆర్ఎస్ సర్కారును టార్గెట్ చేసినా, తాను మాత్రం రాజకీయ విమర్శల జోలికి వెళ్లలేదు. 


దీనిపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ మిత్రులారా... తన చీకటి మిత్రుడు కేసీఆర్ పేరు కూడా ప్రస్తావించకుండా కుటుంబపాలన, అవినీతి ఊసెత్తకుండా మోదీ గారి మిత్రధర్మం చూశారుగా...! అంటూ ట్వీట్ చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ భాయిభాయి అంటూ విమర్శించారు. కేసీఆర్ కు మోదీనే అధిష్ఠానం అని వ్యాఖ్యానించారు.


Latest News
 

తెలంగాణ రెయిన్ అలెర్ట్ Mon, Aug 08, 2022, 09:35 PM
తెలంగాణ విద్యార్థులు అలర్ట్ Mon, Aug 08, 2022, 09:23 PM
తెలంగాణ కరోనా అప్డేట్ Mon, Aug 08, 2022, 09:17 PM
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ Mon, Aug 08, 2022, 09:04 PM
విజృంభిస్తున్న కరోనా.. జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు Mon, Aug 08, 2022, 05:31 PM