ఎస్సీ బిడ్డను రాష్ట్రపతిని చేసిన ఘనత ప్రధాని మోదీ సొంతం: ఈటల రాజేందర్

byసూర్య | Mon, Jul 04, 2022, 12:14 AM

ఎస్సీ బిడ్డను రాష్ట్రపతిని చేసిన ఘనత ప్రధాని మోదీ సొంతమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఇప్పుడు ఎస్టీ మహిళను రాష్ట్రపతిని చేయాలని నిర్ణయించారని వ్యాఖ్యానించారు. కానీ ఎస్సీ వ్యక్తిని సీఎం చేస్తానని మాట తప్పిన వ్యక్తి కేసీఆర్ అని ఈటల విమర్శించారు. ఎస్సీ నేతకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి కొన్నాళ్లకే తప్పించారని ఈటల రాజేందర్ ఆరోపించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో నగరంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య చోటుచేసుకున్న ఫ్లెక్సీల రగడపై స్పందించారు. హైదరాబాదులో ప్రధాని మోదీ ఫ్లెక్సీలు కనిపించకూడదని కేసీఆర్ కుట్ర పన్నారని ఆరోపించారు. మోదీ ఫొటో ఫ్లెక్సీలపై లేకున్నా, ఆయన దేశ ప్రజల గుండెల్లో ఉన్నారని ఈటల పేర్కొన్నారు. 


Latest News
 

తెలంగాణ రెయిన్ అలెర్ట్ Mon, Aug 08, 2022, 09:35 PM
తెలంగాణ విద్యార్థులు అలర్ట్ Mon, Aug 08, 2022, 09:23 PM
తెలంగాణ కరోనా అప్డేట్ Mon, Aug 08, 2022, 09:17 PM
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ Mon, Aug 08, 2022, 09:04 PM
విజృంభిస్తున్న కరోనా.. జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు Mon, Aug 08, 2022, 05:31 PM