బీజేపీ సభకు ప్రజా గాయకుడు గద్దర్...ఎందుకో తెలుసా

byసూర్య | Mon, Jul 04, 2022, 12:13 AM

బీజేపీ సభకు  ప్రజా గాయకుడు గద్దర్ వెళ్లారంటే అది నిజంగా పెద్ద వార్తే. ఎందుకంటారా ఆయన నమ్మిన సిద్దాంతాలకు బీజేపీ సిద్దాంతాలు పూర్తిగా భిన్నం...విరుద్దం కూడా. అందుకే ఈ ఆశ్చర్యం. ఇకపోతే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న బీజేపీ ‘విజయ సంకల్ప సభ’కు ప్రజా గాయకుడు గద్దర్ వెళ్లారు. చాలా కాలం వామపక్షాల తరఫున నిలిచిన గద్దర్.. వాటికి విరుద్ధంగా ఉండే బీజేపీ సభా ప్రాంగణానికి రావడం గమనార్హం. తాను ప్రధాని మోదీ ప్రసంగాన్ని వినడానికే సభకు వచ్చానని.. ఆయన ఏం సందేశం ఇస్తారన్నది విన్నాక తాను మీడియాతో మాట్లాడుతానని చెప్పారు. ఇటీవల కొంతకాలంగా రాజకీయ నేతలను కలుస్తున్న గద్దర్.. గతంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిపక్షాల సభకూ హాజరయ్యారు.


ఇదిలావుంటే హెచ్ఐసీసీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న నేతలు.. ప్రత్యేక బస్సుల్లో పరేడ్ గ్రౌండ్స్ సభా ప్రాంగణానికి వెళ్తున్నారు. ఈ మేరకు హెచ్ఐసీసీ వద్ద ప్రత్యేక బస్సులను బీజేపీ నేతలు సిద్ధం చేశారు. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య బస్సులను పరేడ్ గ్రౌండ్స్ కు తీసుకెళ్లనున్నారు. పరేడ్ గ్రౌండ్ సభకు ప్రధాని మోదీ, ఇతర వీవీఐపీలు వస్తుండటంతో వేదిక, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎస్పీజీ భద్రత ఏర్పాటు చేశారు. గ్రౌండ్ లోపల 250 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, అందరినీ క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో స్వల్పంగా వర్షం పడుతోంది. సభా ప్రాంగణంలో భారీ టెంట్లు ఏర్పాటు చేయడంతో సభికులు వాటి కిందకు చేరారు. అయితే సభకు వస్తున్న వారికి మాత్రం ఇబ్బంది ఎదురవుతోంది.


Latest News
 

తెలంగాణ రెయిన్ అలెర్ట్ Mon, Aug 08, 2022, 09:35 PM
తెలంగాణ విద్యార్థులు అలర్ట్ Mon, Aug 08, 2022, 09:23 PM
తెలంగాణ కరోనా అప్డేట్ Mon, Aug 08, 2022, 09:17 PM
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ Mon, Aug 08, 2022, 09:04 PM
విజృంభిస్తున్న కరోనా.. జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు Mon, Aug 08, 2022, 05:31 PM