కుటుంబ పాలనకు చరమ గీతం పాడుతా: పీయూష్ గోయల్

byసూర్య | Sun, Jul 03, 2022, 10:54 PM

తెలంగాణ సీఎంపై  బీజేపీ అగ్రనాయకత్వం తీవ్రఆగ్రహం గుప్పించింది.  తెలంగాణలో కేసీఆర్  కుటుంబ పాలన నడుస్తోందని విమర్శించింది. తెలంగాణలో టీఆర్ఎస్ అవినీతి పాలన, సీఎం కేసీఆర్ కుటుంబ పాలనకు చరమ గీతం పాడుతామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు నిరాశలో ఉన్నారని, వారికి అన్ని రకాలుగా కష్టాలు ఎక్కువయ్యాయని చెప్పారు.  నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చిందని.. కానీ ప్రజల ఆకాంక్షలు నెరవేరనే లేదని మండిపడ్డారు. ఆదివారం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా హెచ్ ఐసీసీ వద్ద ఇతర నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.


కార్యవర్గ భేటీలో తెలంగాణ పరిస్థితులను డీకే అరుణ వివరించారని తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరులకు న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారని వివరించారు. తెలంగాణలో కుటుంబ పాలనకు చెక్ పెట్టి.. బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ ను ఏర్పటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM