ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సింగరేణి

byసూర్య | Thu, Jun 23, 2022, 03:12 PM

తెలంగాణ నల్లబంగార కేంద్రం సింగరేణిలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థుల వయసు 30  ఏళ్లకు మించకూడదు.  ఈ ఉద్యోగాలను ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాలకు చెందిన అభ్యర్థులతో మాత్రమే భర్తీ చేస్తారు.  వివిధ విభాగాల్లో ఖాళీగా 177 జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్2  పోస్టులను  భర్తీ చేస్తామని సంస్థ ప్రకటించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు వచ్చేనెల 10 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ ఉద్యోగాలకు డిగ్రీ  చేసినవారు అర్హులు. డిగ్రీలో కంప్యూటర్స్‌ ఒక సబ్జెక్టుగా ఉండాలి. లేదంటే డిగ్రీతో పాటు కంప్యూటర్స్ లో ఆరు నెలల సర్టిఫికెట్ కోర్సు/ డిప్లొమా చేయాలి.  


రాత పరీక్ష ద్వారా అభ్యర్థలును ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి రూ. 29, 460 పే స్కేల్ తో వేతనం లభిస్తుంది. జనరల్ రూ. 400, ఎస్సీ, ఎస్టీ, సింగరేణి ఉద్యోగుల పిల్లలు రూ. 100తో  దరఖాస్తు చేసుకోవాలి.  ఇతర వివరాలకు సింగరేణి వెబ్సైట్https://scclmines.com/ చూడవచ్చు.


Latest News
 

కొందరు మూర్ఖులు ప్రచారం చేశారు: యాదమ్మ Sun, Jul 03, 2022, 10:56 PM
దారిచూపే 'విశ్వ గురువు'గా భారత్ ఎదుగుతుంది: అమిత్ షా Sun, Jul 03, 2022, 10:55 PM
కుటుంబ పాలనకు చరమ గీతం పాడుతా: పీయూష్ గోయల్ Sun, Jul 03, 2022, 10:54 PM
ఇక్కడ ఒక్క కేంద్ర పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయడం లేదు : సీఎం యోగి ఆదిత్యనాథ్ Sun, Jul 03, 2022, 09:51 PM
బీజేపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తుంది : ప్రధాని మోడీ Sun, Jul 03, 2022, 09:44 PM