ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

byసూర్య | Thu, Jun 23, 2022, 08:32 AM

హైదరాబాద్ నగర శివార్లలోని ఘట్‌కేసర్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం చేటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల్లో ఓ యువతి, ఇద్దరు యువకులు ఉన్నారు. ప్రముఖ వెబ్ సైట్ కథనం ప్రకారం....ఘట్‌కేసర్‌ పరిధిలోని అవుషాపూర్‌ వద్ద వరంగల్‌ జాతీయ రహదారిపై గురువారం ఉదయం గుర్తుతెలియని వాహనం బైకును ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది.

Latest News
 

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది : షర్మిల Fri, Jul 01, 2022, 10:14 AM
కెటిఆర్ ను కలిసిన ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి Fri, Jul 01, 2022, 10:13 AM
సిఎం సహాయనిధి నిరు పేదలకు వరం Fri, Jul 01, 2022, 10:12 AM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు Fri, Jul 01, 2022, 08:57 AM
సర్పంచ్ సహా ముగ్గురిపై కేసు Fri, Jul 01, 2022, 08:57 AM