కేసీఆర్ కుటుంబ అవినీతిపై విచారణ జరిపించండి: సీబీఐ డైరెక్టర్ ను కోరిన కే.ఏ.పాల్

byసూర్య | Wed, Jun 22, 2022, 04:49 PM

ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై ఇటీవల విరుచుకుపడుతున్న ప్రజాశాంతి పార్టీ అధినేత, క్రైస్తవ మత బోధకుడు ఓ అడుగు ముందుకేశారు. కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడిందని సీబీఐ డైరెక్టర్ కు ఆయన ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆయ‌న కుటుంబ స‌భ్యులు భారీ ఎత్తున అవినీతికి పాల్ప‌డ్డార‌ని, ఈ వ్య‌వ‌హారంపై ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని సీబీఐ డైరెక్ట‌ర్ సుభోద్ జైస్వాల్‌కు ప్ర‌జా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు బుధ‌వారం ఢిల్లీలో సీబీఐ కార్యాల‌యానికి వెళ్లిన పాల్‌ సీబీఐ డైరెక్ట‌ర్‌తో అర గంట పాటు భేటీ అయ్యారు.


సీబీఐ డైరెర‌క్ట్‌తో భేటీ తర్వాత కార్యాల‌యం బ‌య‌ట‌కు వ‌చ్చిన కేఏ పాల్ అక్క‌డే మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం ఏకంగా రూ.9 ల‌క్ష‌ల కోట్ల మేర అవినీతికి పాల్ప‌డింద‌ని ఆయ‌న ఆరోపించారు. ఈ వ్య‌వ‌హారానికి సంబంధించిన స‌మగ్ర ఆధారాల‌ను సీబీఐ డైరెక్ట‌ర్‌కు అంద‌జేశాన‌ని ఆయ‌న తెలిపారు. తాను అంద‌జేసిన ఆధారాల‌ను ప‌రిశీలిస్తామ‌ని, అవ‌స‌ర‌మ‌నుకుంటే త‌న‌ను సంప్ర‌దిస్తామ‌ని సీబీఐ డైరెక్ట‌ర్ చెప్పిన‌ట్టు పాల్ వెల్ల‌డించారు. 


Latest News
 

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది : షర్మిల Fri, Jul 01, 2022, 10:14 AM
కెటిఆర్ ను కలిసిన ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి Fri, Jul 01, 2022, 10:13 AM
సిఎం సహాయనిధి నిరు పేదలకు వరం Fri, Jul 01, 2022, 10:12 AM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు Fri, Jul 01, 2022, 08:57 AM
సర్పంచ్ సహా ముగ్గురిపై కేసు Fri, Jul 01, 2022, 08:57 AM