కేటీఆర్ సీఎం కావడం తథ్యం: ఎమ్మెల్యే వివేకానంద గౌడ్

byసూర్య | Wed, Jun 22, 2022, 02:38 PM

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో కేటీఆర్ నెక్స్ట్ సీఎం అన్న ప్రచారం జోరందుకొంటోంది. రానున్న రోజుల్లో కేటీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని.. కేసీఆర్ ఢిల్లీలో జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అన్నారు. హైదరాబాద్‌‌లోని కైతలాపూర్‌-మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీ మధ్య ఫ్లైఓవర్‌‌ను కైతలాపూర్‌ వద్ద ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం తథ్యం అని చెప్పారు. కేసీఆర్ ఢిల్లీలో జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతారని.. కేటీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. సిరిసిల్లలో ఏ రకమైనా అభివృద్ధి జరిగిందో.. అన్ని నియోజక వర్గాల్లో అదే రకమైన అభివృద్ధి జరుగుతోందన్నారు. ఒకప్పుడు ఎన్నో సమస్యలు ఉండేవని.. ఇప్పుడు అవేమీ కనిపించడం లేదన్నారు. మౌలిక సదుపాయాలు మెరుగు పడ్డాయన్నారు. హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందుతోందని చెప్పుకొచ్చారు.


అంతకుముందు మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. బీజేపీ పాలనలో దేశంలో ఏ వర్గమూ సంతోషంగా లేదన్నారు. బీజేపీ నేతలు కుల మతాల మధ్య పంచాయితీ పెడుతున్నారని మండిపడ్డారు. అగ్నిపథ్‌ పేరుతో యువత పొట్టకొడుతున్నారని.. అగ్నిపథ్‌ శిక్షణలో బట్టలు ఉతకడం, హెయిర్‌ కట్‌, డ్రైవింగ్‌ నేర్పిస్తారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారని.. అవి నేర్చుకునేందుకు దేశ యువత మిలిటరీలో చేరాలా? అని మంత్రి ప్రశ్నించారు. దేశాన్ని రామరాజ్యం చేస్తామని చెప్పి.. రావణకాష్టం చేశారని ఫైర్ అయ్యారు.


Latest News
 

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం Fri, Jun 09, 2023, 09:52 PM
కేసీఆర్ మార్క్ పాలనకు నిదర్శనం,,,.తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు,,,,,మంత్రి సబితా ఇంద్రారెడ్డి Fri, Jun 09, 2023, 09:38 PM
చేప మందు పంపిణీ తో రద్దీ కారణంగా పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు Fri, Jun 09, 2023, 09:37 PM
రెండు, మూడు రోజుల్లో ఏ పార్టీ అనేది క్లారిటీ ఇస్తా,,,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి Fri, Jun 09, 2023, 09:36 PM
వికలాంగులకు మరో వెయ్యి రూపాయలు పెంచిన కేసీఆర్,,,మొత్తం రూ. 4116 పెన్షన్ Fri, Jun 09, 2023, 09:36 PM