తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్ ముందు 24 క్రాఫ్ట్స్ కార్మికులు ఆందోళన

byసూర్య | Wed, Jun 22, 2022, 12:28 PM


తమకు వేతనాలు పెంచాలని తెలుగు సినీ కార్మికులు బుధవారం కదం తొక్కారు. హైదరాబాద్‌లో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫీసు వద్ద భారీగా చేరుకున్నారు. 24 క్రాఫ్ట్స్‌కు చెందిన వేలాది సినీ కార్మికులు అక్కడకు చేరుకుని నిరసన చేపట్టారు. ప్రస్తుతం తమకు రోజంతా పని చేస్తే రూ.1100లు ఇస్తున్నారని, రోజూ తమకు పని ఉండదని వాపోతున్నారు. వేతనం పెంచితేనే సమ్మె విరమిస్తామని స్పష్టం చేశారు. తాజా సమ్మెతో చిరంజీవి భోళాశంకర్, ప్రభాస్, అజయ్ దేవగణ్, విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్స్ అర్థాంతరంగా నిలిచిపోయాయి.


Latest News
 

మహిళ దారుణ హత్య Tue, Jul 05, 2022, 12:36 PM
హైదరాబాద్‌లో నకిలీ బాబాలు అరెస్టు Tue, Jul 05, 2022, 12:34 PM
టీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ Tue, Jul 05, 2022, 12:33 PM
మళ్లీ రేషన్‌ కార్డుపై ఉచిత బియ్యం Tue, Jul 05, 2022, 12:29 PM
తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు Tue, Jul 05, 2022, 12:13 PM