కార్యకర్తలకు అండగా ఉంటా: ఎమ్మెల్యే

byసూర్య | Wed, Jun 22, 2022, 11:19 AM

పార్టీ క్షేత్ర స్థాయి పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కార్యకర్తలకు తాను అండగా ఉంటానని ఎల్బీనగర్ ఎమెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. లింగోజిగూడ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు సమావేశం మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస్ రావు అధ్యక్షతన కర్మన్ ఘాట్ కొత్తకాపు యాదవరెడ్డి గార్డెన్స్ లో నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న సుధీర్ రెడ్డి మాట్లాడుతూ. ఇతర పార్టీ నాయకులు సామాజిక మాధ్యమాలలో చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పి కొట్టాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజే యాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ మాజీ అధ్యక్షుడు తిలక్ రావు, నాయ కులు నర్రె శ్రీనివాస్, భాస్కర్ గంగపుత్ర. శ్రవన్ కుమార్ గుప్తా, పార్వతి, దేవి, సరళ పాల్గొన్నారు.

Latest News
 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు Fri, Jul 01, 2022, 08:57 AM
సర్పంచ్ సహా ముగ్గురిపై కేసు Fri, Jul 01, 2022, 08:57 AM
రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలు Fri, Jul 01, 2022, 08:52 AM
నేడు కాంగ్రెస్ సోషల్ మీడియా సమావేశం Fri, Jul 01, 2022, 08:51 AM
నాన్ స్టాప్ బస్ సౌకర్యం కల్పించాలి Fri, Jul 01, 2022, 08:49 AM