ఈనెల 30 నుంచి గోల్కొండ బోనాలు

byసూర్య | Wed, Jun 22, 2022, 09:36 AM

ఆషాఢ మాసం వచ్చిందంటే తెలంగాణలో బోనాల సందడి మొదలైపోతోంది. ఆడపడుచులంతా నెత్తిన బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీ.


పోతురాజుల కోలాహలం, శివశక్తుల పూనకంతో భక్తులు సరికొత్త ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్లిపోతారు. మొదట గోల్కొండ బోనాలతో మొదలై, ఆ తర్వాత సికింద్రాబాద్ మహంకాళి బోనాలతో పీక్‌ స్టేజ్‌కు చేరుతుంది సందడి. అనంతరం, జంట నగరాల్లో జరిగే బోనాలతో సందడి ముగుస్తుంది. ప్రతి ఏటా తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే బోనాలకు అంకురార్పణ జరిగింది. ఈనెల 30నుంచి గోల్కొండ బోనాలు ప్రారంభంకానున్నాయ్. గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, బోనాల నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్షించారు.


అనంతరం, ఉన్నతాధికారులతో మీటింగ్‌ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండగలో ఎలాంటి లోపాలకు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈనెల 30న మధ్యాహ్నం 12గంటలకు గోల్కొండ బోనాలు ప్రారంభం అవుతాయని మంత్రి తలసాని తెలిపారు. ప్రభుత్వం తరపున గోల్కొండ జగదాంబిక అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు ఆయన వెల్లడించారు. బోనాల నిర్వహణకు ప్రభుత్వం రూ. 15కోట్లు మంజూరు చేసిందని మంత్రి తలసాని తెలిపారు. ఇక, సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారి బోనాలు జులై 17, 18 తేదీల్లో, హైదరాబాద్‌ అంతటా జులై 24, 25 తేదీల్లో బోనాలు జరుగుతాయన్నారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM