25 న తెలంగాణ ఇంటర్ ఫలితాలు...

byసూర్య | Wed, Jun 22, 2022, 09:10 AM

ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను ఈ నెల 25న విడుదల చేసేందుకు ఇంటర్‌బోర్డు కసరత్తు చేస్తోంది. పరీక్షలన్నీ మే 24తో పూర్తికాగా అదే నెల 8 నుంచి జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించారు. ఫలితాలను జూన్‌ 20లోపు వెల్లడిస్తామని నెల రోజుల క్రితమే ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌ మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రక్రియ మొత్తం పూర్తయినందున తప్పులు రాకుండా సాఫ్ట్‌వేర్‌ ద్వారా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో జూన్‌ 25న ఫలితాలు విడుదల చేసేందుకు బోర్డు సిద్ధమైనట్లు సమాచారం. సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం ఫలితాలు వెలువడిన 15 రోజుల్లోనే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని జలీల్‌ గతంలోనే ప్రకటించారు.

Latest News
 

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు Tue, Jul 05, 2022, 12:13 PM
కన్నుల పండుగగా కళ్యాణ మహోత్సవం హాజరైన ప్రజాప్రతినిధులు Tue, Jul 05, 2022, 12:12 PM
కాలనీ సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్ Tue, Jul 05, 2022, 12:07 PM
క్రాంప్టన్ సిగ్నేచర్ స్టూడియోను ప్రారంభించిన డిప్యూటీ మేయర్ Tue, Jul 05, 2022, 12:03 PM
ఇంటికో ఉద్యోగం బోగస్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే Tue, Jul 05, 2022, 11:53 AM