మనస్థాపానికి గురై ఉరి వేసుకున్న వ్యక్తి

byసూర్య | Wed, Jun 22, 2022, 08:18 AM

భార్య చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తున్న ఓ వ్యక్తి మద్యానికి బానిసై అర్ధరాత్రి ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు. ఈ ఘటన బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం బేగంపేట్ పాటిగడ్డకు చెందిన కర్నాల వేణు (37) భార్య ఏండ్ల క్రితం చనిపోయింది. అప్పటికే ఇద్దరు పిల్లలున్నారు. భార్య చనిపో యిన తర్వాత ఇద్దరి పిల్లలను వేణు అన్న నందకిషోర్ దత్తత తీసుకుని పెంచుతు న్నాడు. వేణు ఓ కారు గ్యారేజీలో వాషర్మేన్ గా పని చేస్తూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి సోమవారం రాత్రి మద్యం సేవించి తన గదిలోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం అతని సోదరుడు నందకిషోర్ వెళ్లి తలుపు కొట్టగా తీయకపో వడంతో అనుమానం వచ్చి పగల కొట్టి చూశారు. అప్పటికే వేణు మృతి చెంది ఉన్నా డు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పి టలు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Latest News
 

అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం Tue, Jul 05, 2022, 11:21 AM
జగద్గిరిగుట్టలో దారుణం.. Tue, Jul 05, 2022, 11:17 AM
ఏడుపాయల అమ్మవారికి ప్రత్యేక హారతి Tue, Jul 05, 2022, 10:58 AM
విష్ణువర్దన్ రెడ్డి ఇంట్లో టీ కాంగ్రెస్ నేతలు కీలక సమావేశం Tue, Jul 05, 2022, 10:46 AM
పేకాట స్థావరాలపై పోలీసుల దాడి Tue, Jul 05, 2022, 10:34 AM